జడ్చర్ల టౌన్: భయం నుంచి శాసించే స్థాయికి బ్రా హ్మణులు ఎదగాలని.. అది ఐక్యతతోనే సాధ్యమవుతుందని బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ అన్నారు. ఆదివారం బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీసెస్ నేతృత్వంలో జడ్చర్లలోని వాసవీ గార్డెన్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా బ్రాహ్మణ శంఖారావంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సభ స్ఫూర్తితో రాష్ట్రంలోని అన్ని ఉ మ్మడి జిల్లాల్లో శంఖారావాలు నిర్వహిస్తామన్నారు. చివరగా హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున నిర్వహించే సభకు సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానిస్తామన్నారు. ఇప్పటికే బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం కోసం ప్రయ త్నిస్తున్నామని.. ఇదివరకే ముఖ్యమంత్రికి విన్నవించడం జరిగిందన్నారు. మరో సారి కలసి కోరుతామన్నారు. ముఖ్యంగా అర్చకత్వం చేయాలంటే భ యం కలుగుతుందని.. అలాంటి స్థితి నుంచి రక్షణ దళాలు ఏర్పర్చుకుని ఎలాంటి భయం లేకుండా అర్చకత్వం చేసుకునేలా చేద్దామన్నారు. దేవాలయ పాలక మండళ్లలో అర్చకులకు స్థానం ఉండాలని.. అందుకోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఫలాలు బ్రాహ్మణులకు అందేలా చూస్తున్నామన్నా రు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇద్దరు కో–ఆర్డినేటర్లు, జిల్లాకు సూపర్‌వైజర్లను నియమించేలా చూస్తున్నామని.. తద్వారా ఆయా నియోజకవర్గాల్లో నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందేందు కు సహాయకారిగా ఉంటారన్నారు. శంఖారావానికి వచ్చి చూపిన ఐక్యత మున్ముందు కొనసాగిస్తే శాసించే స్థాయికి ఎదగడం తథ్యమన్నారు. అనంతరం ముఖ్యవక్త జీ న్యూస్ సీఈఓ భరత్‌కుమార్ మాట్లాడుతూ.. ఉత్తర భారతదేశంలో నలుగురు సీ ఎంలు బ్రాహ్మణులు ఉండగా.. తెలంగాణ అసెంబ్లీలో కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. ఏపీ అసెంబ్లీలో బ్రాహ్మణులే లేరన్నారు. దేశంలో హిందూ సమాజం ఇంకా బతికి ఉండేందుకు బ్రాహ్మ ణులే కారణమన్నారు. అయితే తెలంగాణలో మాత్రం బ్రాహ్మణులమని చెప్పుకోవడానికి భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో పూజ ఎక్కడ చేయాలనే వివాదంలో బ్రాహ్మణుడు చనిపోయాడని గుర్తుచేశారు. అందుకే ఐక్యంగా ఉంటేనే మళ్లీ పూర్వవైభవం వస్తుందని.. బ్రాహ్మణ అట్రా సిటీ చట్టం సాధనే లక్ష్యంగా పోరాడుదామని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం శంఖారావంలో పలు తీర్మానాలను ఆమోదించారు. కార్యక్రమంలో శంఖారా వం కోర్ కమిటీ సభ్యులు శంకర్‌బాబు, రాఘవేంద్రశర్మ, కన్వీనర్ నాగరాజు, బ్రాహ్మణ పరిషత్ మాజీ డైరెక్టర్ గోపాలశర్మ, నిర్వాహకులు బాదేపల్లి రంజిత్‌బాబు, నర్సింగ్‌రావు, భైరంపల్లి రమేశ్, ఎర్ర శ్రీను, రమాకాంత్ పాల్గొన్నారు.


