ఐదు నెలల గర్భిణికి తీరని శోకం! | - | Sakshi
Sakshi News home page

ఐదు నెలల గర్భిణికి తీరని శోకం!

Oct 26 2026 2:46 AM | Updated on Oct 26 2026 2:46 AM

బిడ్డ రాక కోసం ఎదురుచూస్తూ..

నారాయణపేట/ధన్వాడ/కొత్తపల్లి:ఎనిమిదేళ్ల దాంపత్య జీవితం.. త్వరలో తమ జీవితాల్లోకి బిడ్డ రా బోతున్నాడన్న ఆనందం.. ఎన్నో ఆశలతో సాగుతు న్న ఆ కుటుంబంలో అంతలోనే తీరని విషాదం అ లుముకుంది. బంధువుల ఇంటి శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న రాజు (26) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఐదు నెలల గర్భిణిగా ఉన్న భార్య అంజమ్మకు భర్తను దూరం చేశాడు. పుట్టబోయే బిడ్డకు తండ్రి ప్రేమను అందించకముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులు బాలప్ప, కిష్టమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం మందిపల్లిలో విషాదం నెలకొంది.

శుభకార్యానికి వెళ్లి.. శవమై తిరిగి

మందిపల్లికి చెందిన రాజు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం అంజమ్మను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. ఈ క్రమంలో ఆదివారం నారాయణపేటలోని బంధువుల నూతన గృహ కార్యక్రమానికి వెళ్లిన రాజు.. తిరిగి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. జాజాపూర్‌ బస్టాండ్‌ సమీపంలో రాజు ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్‌ చేసేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఎదురుగా నారాయణపేట వైపు నుంచి స్కూటీపై వస్తున్న మద్దూరు మండలం కొత్తపల్లికి చెందిన ఆర్మీ వీరయ్య వాహనాన్ని రాజు బైక్‌ ఢీకొంది. దీంతో రాజు అదుపుతప్పి అటువైపు వెళుతున్న ట్రాక్టర్‌ వెనుక చక్రాల కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వీరయ్య తీవ్రంగా గాయపడటంతో నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ సతీష్‌రెడ్డి తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి

ఎనిమిదేళ్ల దాంపత్య బంధంలో

అంతులేని విషాదం

పుట్టబోయే బిడ్డకు తండ్రి ప్రేమ కరువు

ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు

మరికొద్ది నెలల్లో బిడ్డకు జన్మనివ్వాల్సిన అంజమ్మకు భర్త మరణం తీరని వేదనను మిగిల్చింది. తమ జీవితాల్లోకి కొత్త వెలుగు వస్తుందని ఎదురుచూస్తున్న తరుణంలో ఈ విషాదం ఆ కుటుంబాన్ని కుంగదీసింది. పుట్టబోయే బిడ్డకు తండ్రి ప్రేమను అందించే అవకాశం లేకుండా రాజు దూరమయ్యాడు. తమకు అండగా ఉంటాడని భావించిన ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు గ్రామస్థులను కలచివేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement