‘పాలమూరు’ నీటి పంపింగ్‌ నిలిపివేత | - | Sakshi
Sakshi News home page

‘పాలమూరు’ నీటి పంపింగ్‌ నిలిపివేత

Oct 20 2026 4:49 AM | Updated on Oct 20 2026 4:49 AM

కొల్లాపూర్‌: పాలమూరు ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతలు సోమవారం సాయంత్రం నుంచి నిలిపివేశారు. ఈ నెల 14న పాలమూరు ప్రాజెక్టు మొదటి లిఫ్టులోని 2 మోటార్ల ద్వారా నీటి ఎత్తిపోతలను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే మొదటి రోజు విద్యుత్‌ సరఫరాలో సమస్యల కారణంగా 5.30 గంటలపాటు నీటి సరఫరా ఆపేసిన అధికారులు తర్వాత 5 రోజులపాటు నిర్విరామంగా రెండు మోటార్లను నడిపించారు. రెండు మోటార్ల ద్వారా 2 టీఎంసీలకుపైగా నీటిని ఎత్తిపోసినట్లు నీటిపారుదల శాఖ ఈఈ లోకిలాల్‌నాయక్‌ తెలిపారు. ఒక్కో మోటారు ద్వారా రోజూ 0.25 టీఎంసీ నీటిని ఎత్తిపోశామన్నారు. 14వ తేదీ కంటే ముందు నార్లాపూర్‌ రిజర్వాయర్‌లో 3.5 టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. ప్రస్తుతం 6 టీఎంసీలకు పైగా నీటి నిల్వ ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement