ధ్వజధారిగా అవకాశం సంతోషంగా ఉంది | - | Sakshi
Sakshi News home page

ధ్వజధారిగా అవకాశం సంతోషంగా ఉంది

Oct 20 2026 4:49 AM | Updated on Oct 20 2026 4:49 AM

దసరా సంబరాలకు మహబూబ్‌నగర్‌ నగరం కేరాఫ్‌గా నిలుస్తోంది. ప్రతి ఏడాది ఇక్కడ జరిగే దసరా పండుగ వేడుకలు ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపును సంతరించుకున్నాయి. దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 43 ఏళ్ల నుంచి పండుగ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. మొదట 19 ఏళ్లు టీడీగుట్ట ప్రాంతంలో ఉత్సవాలు నిర్వహించగా 21 ఏళ్లుగా జెడ్పీ మైదానంలో దసరా వేడుకలను నిర్వహించారు. 2023లో మినీ ట్యాంక్‌బండ్‌ వద్ద దసరా సంబరాలు నిర్వహించారు. రెండేళ్లుగా ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది దసరా పండుగకు సంబంధించి ధ్వజధారిని నిర్ణయిస్తారు. ఈ సారి ధ్వజధారిగా గోరంట్ల మాల్యాద్రిరెడ్డి వ్యవహరిస్తున్నారు. పండుగ రోజు ఆర్యసమాజం మందిరంలో మంగళవారం ఉదయం 8 గంటలకు దేవయజ్ఞం, వేదోపదేశం నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు అక్కడి నుంచి కోలాట ప్రదర్శనలతో ఊరేగింపుతో బయలుదేరుతారు. ధ్వజధారి ధ్వజాన్ని ధరించి 3 గంటలకు రాంమందిర్‌ చౌరస్తాలో గల దసరా కట్ట దగ్గర జనసమ్మేళనాన్ని నిర్వహిస్తారు.

నగర పురవీధుల గుండా ర్యాలీ...

ఉత్సవ జెండాతో నగర పురవీధుల గుండా భారీ ర్యాలీ చేపడుతారు. పాన్‌చౌరస్తా నుంచి వచ్చిన భారీర్యాలీకి క్లాక్‌టవర్‌ వద్ద ఖౌమీ ఏక్తా కమిటీ ఆధ్వర్యంలో స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ర్యాలీ ట్యాంక్‌బండ్‌ వద్దకు వద్దకు చేరుకుంటుంది. వేడుకలను పురస్కరించుకొని మైదానంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. అనంతరం తదుపరి పలు అస్త్రాల పేరుతో ఏర్పాటు చేసిన రంగురంగుల టపాసులను పేలుస్తారు.

● దసరా వేడుకలకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల మైదానం సిద్దమవుతోంది. ఒక పక్క ప్రధాన వేదిక, మరో పక్క బాణాసంచా కోసం ప్రత్యేక బారీకేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా బాణాసంచా కోసం ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. దసరా పండుగ ఉత్సవాల్లో వేలాదిగా ప్రజలు పాల్గొంటారు.

ఈ ఏడాది దసరా ఉత్సవాలకు దసరా ఉత్సవ కమిటీ వారు ధ్వజధారిగా నాకు అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. 20 ఏళ్ల నుంచి దసరా ఉత్సవ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న.

– గోరంట్ల మల్యాద్రిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement