మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగరంలోఆదివారం సాయంత్రం కొద్ది సేపు మోస్తరు వర్షం కురిసింది. కొన్ని రోజులుగా ఎండల వేడి మికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర ప్రజలు.. తాజాగా కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడటంతో సేదతీరారు. ఇదిలా ఉండగా.. చుట్టుపక్కల ప్రాంతాల్లో కురిసిన వర్షంతో వరి పంటకు కాస్త మేలు చేయగా.. పత్తికి నష్టం చేకూరుస్తుందని రైతులు పేర్కొన్నారు.
వినూత్న నిరసన
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం ఆరోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా నగరంలోని టీటీడీ కల్యాణ మండపం ఎదుట దీక్ష శిబిరంలో వారు మోకాళ్లపై కూర్చొని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎన్‌హెచ్‌ఎం జాక్ జిల్లా అధ్యక్షుడు సునీల్ మాట్లాడుతూ తమకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆరోగ్య శాఖలో వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను ప్రభుత్వం వెంటనే గుర్తించి తమ డిమాండ్లను పరిష్కరించాలని, ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు.


