కవలలను విడదీసిన మృత్యువు | - | Sakshi
Sakshi News home page

కవలలను విడదీసిన మృత్యువు

Oct 19 2026 1:01 AM | Updated on Oct 19 2026 1:01 AM

వనపర్తి రూరల్‌: ఉన్నత చదువుల కోసం వెళ్లిన కవలను మృత్యువు విడదీసింది. వనపర్తిలోని సుభాష్‌నగర్‌కు చెందిన అశోక్‌చారి, లక్ష్మి దంపతులకు సోనా, మీనా కవలలు పుట్టారు. వీరు రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం నాదర్‌గూల్‌లోని ఎంవీఎస్‌ఆర్‌ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్నారు. శనివారం కళాశాలలో నిర్వహించిన సంగమం–2026 వేడుకల్లో దాండియా ఆడుతున్న విద్యార్థులపై ఒక్కసారిగా భారీ లైటింగ్‌ క్రేన్‌ కూలి పడటంతో సోనా(18) అక్కడికక్కడే మృతిచెందగా, మీనా తీవ్రగాయాలతో యశోద ఆస్పత్రిలో చికి త్స పొందుతుంది. ఒక కూతురు మృతి, మరో కూతురు తీవ్ర గాయాలపాలైన విషయం తెలు సుకున్న తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం సోనా మృతదేహం ఉస్మాని యా ఆస్పత్రి మార్చురీ ఉంది. ఈ ఘటనతో కు టుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.

● వనపర్తిలో విషాదం నింపిన

బీటెక్‌ విద్యార్థిని సోనా మృతి

● తీవ్రగాయాలతో చికిత్స

పొందుతున్న మీనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement