జూరాల జలాశయంలో చేపలు మృతి | - | Sakshi
Sakshi News home page

జూరాల జలాశయంలో చేపలు మృతి

Oct 19 2026 1:01 AM | Updated on Oct 19 2026 1:01 AM

ఆత్మకూర్‌: ఎల్‌నినో విలయతాండవం చేస్తోంది. ఎండల ప్రభావంతో జలాశయాల్లో క్రమంగా నీటి నిల్వలు తగ్గుతుండటంతో ఆక్రిజన్‌ అందక చేపలు మృత్యువాత పడుతున్నాయి. ఆదివారం దిగువ జూరాల జల విద్యుత్‌ కేంద్రం వద్ద బ్యాక్‌వాటర్‌లో వేల సంఖ్యలో చేపలు మృతిచెందాయి. విషయాన్ని గమనించిన జెన్కో ఉద్యోగులు, మత్స్యకారులు నీరు విషతుల్యంగా మారాయేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దీనిపై మత్స్యశాఖ అధికారి లక్ష్మప్ప స్పందిస్తూ.. ఆక్సిజన్‌ అందకనే చేపలు మృతిచెందాయని, నీరు విషతుల్యం కాలేదని వివరించారు.

పొలంలో వృద్ధుడి

మృతదేహం లభ్యం

కొత్తకోట రూరల్‌: మండలంలోని కనిమెట్ట గ్రామానికి చెందిన ధర్మారెడ్డి (68) వారం రోజులుగా అదృశ్యమై ఆదివారం ఉదయం పొలంలో మృతదేహంగా కనిపించాడు. ఈ నెల 10న ఉదయం పొలానికి వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పిన ధర్మారెడ్డి సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆయన కుమారుడు శివప్రసాద్‌రెడ్డి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం ధర్మారెడ్డి పక్క పొలానికి చెందిన అమరచింత శ్రీనివాస్‌రెడ్డి తన వరి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లగా.. ఏపుగా పెరిగిన పంటలో కుక్కలు తిరుగుతుండటంతో అక్కడి వెళ్లగా కుళ్లిపోయిన మృతదేహాన్ని గుర్తించాడు. వెంటనే విషయాన్ని సర్పంచ్‌ రాంచంద్రికి, ధర్మారెడ్డి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో అక్కడికి చేరుకున్న వారు మృతదేహం ధర్మారెడ్డిదిగా గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, వైద్య సిబ్బందితో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. శ్రీనివాస్‌రెడ్డి పొలం గట్టున ఉన్న మునగ చెట్టు నుంచి కాయలు తెంపేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెంది ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో కనిమెట్టలో విషాధం నెలకొంది.

తల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్య

బల్మూర్‌: మండలంలోని గట్టుతుమ్మెన్‌ గ్రామానికి చెందిన యువతి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజేందర్‌ తెలిపిన వివరాల మేరకు.. శృతిని (17) చదువు విషయంలో తల్లి మందలించింది. ఈక్రమంలో మనస్థాపానికి గురైన యువతి శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అచ్చంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాని అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఘనటపై మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగింంచినట్లు ఎస్‌ఐ వివరించారు.

మూడు వాహనాలు ఢీ.. తప్పిన ప్రమాదం

మరికల్‌: మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటన మండలంలోని రాకొండ స్టేజీ దగ్గర ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. దేవరకద్ర నుంచి మరికల్‌ వైపు వస్తున్న టిప్పర్‌ రాకొండ స్టేజీ స మీపంలోకి రాగానే అదుపుతప్పి ముందు వెళ్తు న్న కర్ణాటక బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు ముందున్న కారును ఢీకొట్టింది. ప్రమాదంలో కారు దెబ్బతినగా బస్సు తో పా టు కారులోని కొంతమంది ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. వేగం తక్కువ గా ఉండటంతో పెనుప్రమాదం తప్పిందని బస్సు లోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

గుర్తు తెలియని

మృతదేహం లభ్యం

కొల్లాపూర్‌ రూరల్‌: మండలంలో సోమశిల గ్రామంలోని కృష్ణానది బ్యాక్‌ వాటర్‌లో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్‌ఐ ఆనంద్‌ తెలిపారు. మృతదేహం పురుషుడిదని వయసు 35 ఏళ్లు ఉంటుందన్నారు. సోమశిల సర్పంచ్‌ వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎవరికై నా వివరాలు తెలిస్తే 87126 57719 నంబరును సంప్రదించాలని ఎస్‌ఐ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement