శాంతమూర్తి.. మహాగౌరి | - | Sakshi
Sakshi News home page

శాంతమూర్తి.. మహాగౌరి

Oct 19 2026 1:01 AM | Updated on Oct 19 2026 1:01 AM

● మహాగౌరిమాతగా జోగుళాంబ దర్శనం

● అమ్మవారి ఆలయంలో

ఘనంగా రథోత్సవం

● జనసందోహంతో కిక్కిరిసిన

ఆలయ పరిసరాలు

అలంపూర్‌: కష్టాలను తొలగించే మహాగౌరి మాత నమోస్తుతే అంటూ భక్తులు జోగుళాంబ అమ్మవారిని వేడుకున్నారు. దక్షిణ కాశీ అలంపూర్‌ క్షేత్రంలో వెలిసిన శ్రీ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలంయలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల ఎనిమిదోరోజు ఆదివారం జోగుళాంబ అమ్మవారు భక్తులకు మహాగౌరి మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. నవదుర్గ స్వరూపాల్లో మహాగౌరి మాతను ప్రత్యేక మండపంలో కొలువుదీర్చి పూజలు చేశారు. అమ్మవారికి కుమారి పూజలు, సువాసిని పూజలు విశేషంగా నిర్వహించారు. నవరాత్రుల్లో మహాగౌరి అమ్మవారి అలంకరణ ప్రత్యేకతలను అర్చక స్వాములు భక్తులకు వివరించారు. అమ్మవారు అత్యంత శాంతమూర్తిగా పేర్కొన్నారు. మహాగౌరి అమ్మవారిని ఆరాధించడం వలన పాపాలు నశిస్తాయని, కష్టాలు తొలిగిపోతాయని భక్తలకు తెలిపారు.

కనులపండవగా రథోత్సవం

శరన్ననవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జోగుళాంబ అమ్మవారి రథోత్సవం కనులపండువగా జరిగింది. నవరాత్రుల్లో దుర్గాష్టమిని పురస్కరించుకొని అమ ్మవారి ఆలయంలో రథోత్సవం నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. అమ్మవారి గర్భాలయంలో కొలువైన ఉత్సవమూర్తిని పల్లకీసేవలో రథం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ అర్చకులు అమ్మవారిని రథంలో కొరువుదీర్చి పూజలు చేశారు. ఆలయ ఈఓ దీప్తి పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. అమ్మవారి గర్భాలయంలో కొలువైన ఉత్సవమూర్తిని ఏడాదికి ఒకసారి రథోత్సవం నిర్వహిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. క్షేత్ర దర్శనానికి విచ్చేసిన భక్తులు జోగుళాంబ అమ్మవారికి జేజేలు పలుకుతూ రథాన్ని ముందుకు నడిపించారు. రథోత్సవాన్ని వీక్షించడానికి భక్తులు భారీ సంఖలో తరలొచ్చారు.

నిత్యారాధన పూజలు

నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని జోగుళాంబ అమ్మవారి ఆలయంలో నిత్యారాధన పూజలు, నిత్య హోమాలు విశేషంగా జరిగాయి. బలిహరణ, సామూహిక కుంకుమార్చనలు, త్రిశతి నామ కుంకుమార్చనలు, ప్రత్యేక చండీహోమాలు జరిగాయి. బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేక పూజలు, అర్చనలు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement