433 రోజులు పోరాడి ఓడింది | - | Sakshi
Sakshi News home page

433 రోజులు పోరాడి ఓడింది

Oct 19 2026 1:01 AM | Updated on Oct 19 2026 1:01 AM

అడ్డాకుల: రాఖీ పౌర్ణమి ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. రాఖీ పండగకు వచ్చిన అక్కతో కలిసి హైదరాబాద్‌లో ఉండే సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళ్తూ ఇద్దరు రోడ్డు ప్రమాదానికి గురయ్యా రు. అప్పటి నుంచి కోమాలో ఉన్న చెల్లి కోసం ఉన్నదంతా ఖర్చు చేసి బతికించుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కోమాలోంచి బ యట పడకుండానే వివాహిత కన్నుమూసిన సంఘటన తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మహబూబ్‌నగర్‌ జిల్లా మూ సాపేట మండలంలోని వేముల గ్రామానికి చెందిన కుర్వ బాలరాజు, నర్సమ్మ దంపతుల కుమార్తె కు ర్వ నాగమ్మ(33)ను అదే గ్రామానికి చెందిన కుర్వ శివకు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఇద్దరు కుమా ర్తెలు, కుమారుడు ఉన్నారు. కాగా.. 2025 ఆగస్టు 9న రాఖీ పౌర్ణమి రోజు నాగమ్మ అక్క యాదమ్మ (కోయిలకొండ మండలం కేశవాపూర్‌) వేములకు వచ్చింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలిసి సోదరులకు రాఖీ కట్టారు. మరుసటి రోజు హైదరాబాద్‌లో ఉండే మరో సోదరుడికి రాఖీ కట్టడానికి వేముల నుంచి బయలుదేరి జాతీయ రహదారి–44 వద్దకు వచ్చారు. అక్కడ రోడ్డు పక్కన ఉన్న వారిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్ర గాయాలపాలవగా.. నాగమ్మ కోమాలోకి వెళ్లింది. దీంతో భర్త శివతోపాటు తల్లిదండ్రులు ఆమెను కాపాడుకునేందుకు చాలా కష్టపడ్డారు. మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ తీసుకెళ్లి ఖరీదైన వైద్యం చేయించారు. ఎలాగైనా ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో సుమారు రూ.40 లక్షల వరకు వెచ్చించారు. అయినా ఆమె కోమాలోంచి బయటకు రాలేదు. ఈ క్రమంలో గత 8 నెలల నుంచి నాగమ్మను ఇంటి వద్దే ఉంచుకుని గొంతులో అమర్చిన పైపు ద్వారా ఆహారం లోపలికి పంపించి బతికించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయినా ఆమె కోలుకోకుండా 433 రోజులపాటు కోమాలో ఉండి శనివారం రాత్రి మృత్యువు చేసిన పోరాటంలో ఓడి ప్రాణాలు వదిలింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఇదిలా ఉంటే ఇదే ప్రమాదంలో గాయపడిన నాగమ్మ అక్క యాదమ్మ కూడా పూర్తిగా కోలుకోలేదని గ్రామస్తులు తెలిపారు. నాగమ్మను కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాన్ని గ్రామస్తులు గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరయ్యారు.

కోమాలో ఉన్న వివాహిత మృతి

గతేడాది రాఖీ పౌర్ణమి

మరుసటి రోజు రోడ్డు ప్రమాదం

రూ.40 లక్షలు ఖర్చు చేసినా

దక్కని ప్రాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement