పోలేపల్లి శివారులో నెమలి ఈకల కలకలం | - | Sakshi
Sakshi News home page

పోలేపల్లి శివారులో నెమలి ఈకల కలకలం

Oct 19 2026 1:01 AM | Updated on Oct 19 2026 1:01 AM

జడ్చర్ల: మండలంలోని పోలేపల్లి శివారులో జాతీయ పక్షి నెమలి ఈకలు కనపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం రోజులుగా నెమలి ఈకలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలేపల్లి శివారులో గల ఓ పరిశ్రమలో పనిచేసే ఇతర రాష్ట్రాల కార్మికులు అడవిలో నెమళ్లను వేటాడి తిన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే పోలీసులు, అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. పరిశ్రమలో కార్మికులు ఉండే నివాసాల్లో సోదాలు చేసినా ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలిసింది. అయితే అధికారులకు నెమలి ఈకలు తప్ప మరే ఇతర ఆధారాలు దొరకలేదని సమాచారం. దీనిపై మరింత లోతుగా విచారిస్తామని అటవీ శాఖ సెక్షన్‌ అధికారి సుకన్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement