మత్తు పదార్థాల నివారణకు సమష్టి కృషి | - | Sakshi
Sakshi News home page

మత్తు పదార్థాల నివారణకు సమష్టి కృషి

Oct 1 2026 1:17 AM | Updated on Oct 1 2026 1:17 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా విద్యాసంస్థల యాజమాన్యాలు, పోలీసులు, విద్యాశాఖ, ఇతర శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ఖుష్బూగుప్తా సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో మాదకద్రవ్యాల నివారణపై జిల్లా అధికారులు, కళాశాలల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ డి.జానకితో కలిసి ఆమె పాల్గొన్నారు. జిల్లాలో మత్తు పదార్థాల నివారణకు చేపడుతున్న చర్యలు, విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కళాశాలల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలు, భవిష్యత్‌లో ఎదురయ్యే పరిణామాలు, చట్టపరమైన చర్యలపై విద్యార్థులకు వివరించాలని అన్నారు. ముఖ్యంగా మెడికల్‌, ఇంజినీరింగ్‌, యూనివర్సిటీ, ఇతర ప్రొఫెషనల్‌ కళాశాలల్లో ఇండక్షన్‌ కార్యక్రమాల సందర్భంగా ప్రత్యేక అవగాహన కల్పించాలని తెలిపారు. జాతీయ రహదారి–44 పరిధిలోని బాలానగర్‌ తదితర ప్రాంతాల్లో మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యాసంస్థల పరిసరాల్లో మత్తు పదార్థాల విక్రయం, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్పీ డి.జానకి సూచించారు. అన్ని కళాశాలల్లో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన పోస్టర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. డీఆర్వో నిర్మల, ఏఎస్పీ బి.రత్నం, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ రామాంజులారెడ్డి, వివిధ శాఖల అధికారులు, విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement