వయో వృద్ధుల సంక్షేమం, హక్కుల పరిరక్షణే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

వయో వృద్ధుల సంక్షేమం, హక్కుల పరిరక్షణే ధ్యేయం

Oct 1 2026 1:17 AM | Updated on Oct 1 2026 1:17 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): వయో వృద్ధుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ అన్నారు. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. స్టేడియం గ్రౌండ్‌ నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో వయో వృద్ధుల పాత్ర, వారి అనుభవం ఎంతో విలువైనదన్నారు. రాబోయే తరాలకు వారు మార్గదర్శకులని, వారికి గౌరవం, భద్రత, నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వృద్ధుల సంక్షేమ పథకాలు, చట్టపరమైన హక్కులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ జరీనా బేగం, సీనియర్‌ సిటిజన్‌ ఫోరం ఉపాధ్యక్షుడు రాజసింహుడు, కార్యదర్శి నాగభూషణం, కోటేశ్వరరెడ్డి, టి.బుచ్చన్న, నాగేంద్రస్వామి, బాలయ్య, వివిధ శాఖల అధికారులు, సీనియర్‌ సిటిజన్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement