ప్లాట్లు కొనుగోలు చేసే సమయంలో న్యాయపరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలు పరిశీలించే కొనుగోలు చేశాం. 20 ఏళ్ల కిందటే పట్టాదారుల రిజిస్ట్రేషన్లు, నాలా, డీటీసీపీ అనుమతులు ఉన్నాయి. గ్రామపంచాయతీ నుంచి ఇళ్ల నిర్మాణానికి అనుమతులు తీసుకున్నాం. బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. పన్నులు కూడా చెల్లిస్తున్నాం. రికార్డులు సరిగ్గా లేకపోతే ప్రభుత్వం అనుమతులు ఎలా ఇస్తుంది.. బ్యాంకులు రుణాలు ఎలా ఇస్తాయి? ఇన్నేళ్ల తర్వాత దేవాదాయ శాఖ భూమి అంటూ ఇబ్బందులు కల్పించడం సరికాదు. వెంటనే ఎన్‌ఓసీలు జారీ చేసి న్యాయం చేయాలి.
– రాఘవేందర్, అధ్యక్షుడు, సరస్వతీ నగర్ కాలనీ
ఇన్నేళ్ల తర్వాత అభ్యంతరం తగదు
జడ్చర్ల పరిధిలో 20 ఏళ్ల కిందటే డీటీసీపీ అనుమతులతో వెంచర్ ఏర్పాటు చేశారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, బీటీ రోడ్లు, ఓవర్‌హెడ్ ట్యాంకు, పార్కులు వంటి సౌకర్యాలు కూడా కల్పించారు. అన్ని రికార్డులు పరిశీలించిన తర్వాతే మేము ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్నాం. ఇన్నేళ్ల తర్వాత అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదు. వెంటనే సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలి. – మధుసూదన్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు, సరస్వతీ నగర్ కాలనీ


