ఆరు పదులు దాటినా.. తగ్గేదేలే! | - | Sakshi
Sakshi News home page

ఆరు పదులు దాటినా.. తగ్గేదేలే!

Oct 1 2026 1:17 AM | Updated on Oct 1 2026 1:17 AM

జడ్చర్ల టౌన్‌: రిటైర్‌మెంట్‌ తర్వాత ఇంటికే పరిమితం కాకుండా సీనియర్‌ సిటిజన్‌ ఫోరం సభ్యులు సమాజ సేవలో చురుగ్గా పాల్గొంటున్నారు. 60 ఏళ్లు దాటిన వృద్ధుల సంక్షేమమే లక్ష్యంగా ఏర్పాటైన ఫోరాలు మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, హన్వాడ, రాజాపూర్‌, నవాబుపేట, దేవరకద్రల్లో సేవలందిస్తున్నాయి. 2017లో మహబూబ్‌నగర్‌లో 25 మందితో ప్రారంభమైన ఫోరం ప్రస్తుతం 1,600 మంది సభ్యులకు చేరింది. 2022లో జడ్చర్లలో 45 మందితో ప్రారంభమైన ఫోరం 600 మందితో కొనసాగుతోంది. రిటైర్డ్‌ ఉద్యోగులతోపాటు వ్యాపారులు, మేధావులు, ఇతర వర్గాలకు చెందిన 60 ఏళ్లు పైబడిన వారు సభ్యులుగా ఉన్నారు.

న్యాయ.. వైద్య సేవలు

వృద్ధులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతోపాటు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్ర భుత్వ ఆస్పత్రులకు వచ్చే వృద్ధులకు వైద్య సేవలు త్వరగా అందేలా ఫోరం సభ్యులు సహకరిస్తున్నా రు. ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యల్లో ఇరుపక్షాలకు కౌన్సిలింగ్‌ ఇచ్చి రాజీకి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల న్యాయవిజ్ఞాన మండలిలో సభ్యు లుగా చేరి న్యాయ అవగాహన సదస్సుల్లో పాల్గొంటున్నారు.

ఒంటరితనానికి చెక్‌

వృద్ధాశ్రమాల్లో సేవలు అందించడంతోపాటు రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ తదితర ప్రాంతాల్లోని నిరాశ్రయులకు భోజనం, దుప్పట్లు అందిస్తున్నారు. సదరం క్యాంపులకు వచ్చే వారికి భోజనం, స్వగ్రామాలకు వెళ్లేందుకు రవాణా సాయం చేస్తున్నారు. వృద్ధుల్లో ఒంటరితనం తగ్గించేందుకు సభ్యులు వారానికి కొందరి ఇళ్లకు వెళ్లి వారితో సమయం గడుపుతున్నారు. నెలలో పలుమార్లు సమావేశమై సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

జడ్చర్లలోనూ విస్తృత సేవలు

జడ్చర్ల ఫోరం 600 మంది సభ్యులతో జిల్లాకేంద్రం ఫోరంతో సమానంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అవసరమైనప్పుడు సభ్యులే విరాళాలు సమకూర్చుకుని సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వృద్ధుల ఆరోగ్యం, న్యాయ హక్కులపై అవగాహన కల్పించడంతోపాటు వృద్ధాశ్రమాల్లో సేవలందిస్తున్నారు. కుటుంబ సమస్యల్లో కౌన్సిలింగ్‌ ద్వారా పలు కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.

● గద్వాలలో 2012లో సీనియర్‌ సిటిజన్‌ ఫోరం ఏర్పాటైంది. ప్రస్తుతం సుమారు 200 మంది సభ్యులు ఉన్నారని జిల్లా ఫోరం అధ్యక్షుడు మోహన్‌రావు తెలిపారు.

జిల్లావ్యాప్తంగా విస్తరిస్తున్న

సీనియర్‌ సిటిజన్‌ ఫోరం

రిటైర్‌మెంట్‌ తర్వాత విశ్రమించకుండా సమాజసేవలో..

తోటి వృద్ధులకు అండగా..

న్యాయ, వైద్య సేవలు

నేడు ప్రపంచ వృద్ధుల దినోత్సవం

కలెక్టరేట్‌లో ప్రజావాణికి వచ్చే వృద్ధులు దరఖాస్తులు రాయించుకునేందుకు ఇబ్బందులు పడటాన్ని గుర్తించిన ఫోరం సభ్యులు ఉచితంగా దరఖాస్తులు రాసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వృద్ధులకు న్యాయ, వైద్య సహాయం, కౌన్సిలింగ్‌ అందిస్తూ సేవలను విస్తరించారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలకు కౌన్సిలింగ్‌ ఇచ్చి కుటుంబాల్లో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఆర్డీఓ ట్రిబ్యునల్‌లోనూ పలు కేసుల పరిష్కారానికి సహకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement