ఉత్సాహంగా ఎస్‌జీఎఫ్‌ ఉమ్మడి జిల్లా క్రీడాకారుల ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ఎస్‌జీఎఫ్‌ ఉమ్మడి జిల్లా క్రీడాకారుల ఎంపికలు

Oct 1 2026 1:17 AM | Updated on Oct 1 2026 1:17 AM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో బుధవారం స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌–14, అండర్‌–17 విభాగాల ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్‌ బాలబాలికలు ఎంపికలు నిర్వహించారు. ఎంపికలకు దాదాపు 350 మంది హాజరయ్యారు.రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ క్రీడల్లో జిల్లా జట్లు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవాలని మహబూబ్‌నగర్‌ డీవైఎస్‌ఓ రాజశేఖర్‌రెడ్డి అన్నారు.

● మెయిన్‌ స్టేడియంలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఉమ్మడి జిల్లా అండర్‌–14, అండర్‌–17, అండర్‌–19 విభాగాల బాక్సింగ్‌ క్రీడాకారుల ఎంపికలు సైతం నిర్వహించారు. ఆయా కార్యక్రమంలో

పెటాటీఎస్‌ జిల్లా అధ్యక్షులు జగన్‌మోహన్‌గౌడ్‌, ఎస్‌జీఎఫ్‌ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్‌, కోచ్‌లు శంకర్‌, రవికుమార్‌గౌడ్‌, జియావుద్దీన్‌, ప్రదీ్‌ప్‌, అర్చన, సుమతి, రాధ, బాలు, బాక్సింగ్‌అసోసియేషన్‌ ప్రతినిధులు బెక్కరి మధుసూదన్‌రెడ్డి, బొంబాయి నర్సింలు, పీడీ రామేశ్వరయ్య, కోచ్‌ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement