గద్వాల క్రైం: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మండలంలో బుధవారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. కాకులారం గ్రామానికి చెందిన పాండురావ్ (46) బుధవారం ఉదయం గ్రామ శివారులోని తన వ్యవసాయ పొలానికి వెళ్లాడు. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద స్వీచ్ ఆన్ చేసే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై భార్య సరోజమ్మ ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
అనుమానాస్పదంగా యువకుడి మృతి
కందనూలు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బా లుర ఉన్నత పాఠశాల ఆవరణలోని పైకా భవ న్ వెనకాల ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం జరి గింది. పాఠశాల ఆవరణలో మృతదేహాన్ని గు ర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి అనంతరం పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వద్ద లభించి న ఆధారాలు, వస్తువులతో ఎవరనేది తెలుసుకునే పనిలో ఉన్నట్లు తెలిపారు. ఘటనపై ఎస్ ఐ వెంకట్‌రెడ్డిని వివరణ కోరగా.. మృతి చెందిన వ్యక్తికి సంబంధించిన కుటుంబీకు లు, ఇ తరులు ఎవరు లేరని, చిత్తు కాగితాలు సేకరిస్తూ జీవనం సాగించేవాడన్నారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కత్తితో యువకుడి వీరంగం: ముగ్గురికి గాయాలు
నవాబుపేట: రోడ్డుపై ఆర బోసిన మొక్కజొన్న ధా న్యంపై నుంచి ట్రాక్టర్ తీసుకుని వెళ్లడంతో దానిని ప్రశ్నించిన వారిపై డ్రైవర్ కత్తితో వీరంగం సృష్టించిన ఘటన మండలంలోని మ ల్కపూర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. మ ల్కాపూర్‌కు చెందిన కంకట్ల లక్ష్మమ్మ గ్రామంలోని హనుమాన్ ఆలయం సమీపంలో సీసీ రోడ్డుపై మొక్కజొన్నలు ఆరబోసింది. కాగా వాటిపై నుంచి అదే గ్రామానికి చెందిన యువకుడు కుర్వ చందు మంగళవారం రాత్రి ట్రాక్టర్ పోనిచ్చాడు. ధాన్యం పాడవుతుందని, వాటిపై ట్రాక్టర్ ఎందుకు తీసుకెళ్తున్నావు అని లక్ష్మమ్మ కుమారులు చందును నిలదీశారు. కోపోద్రిక్తు డు అయిన డ్రైవర్ చందు కత్తితో లక్ష్మమ్మ కు మారుడు శివకుమార్‌పై పలుమార్లు దాడి చేశా డు. అడ్డుకోబోయిన చాకలి హరికృష్ణ, కుమ్మరి రాఘవేందర్‌పై సైతం చందు దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను వెంటనే 108 వాహనంలో చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు లక్ష్మమ్మ తెలిపారు. ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేందర్ పేర్కొన్నారు.
యూనియన్లకు
గుర్తుల కేటాయింపు
● టీడబ్ల్యూయూ కూటమికి బాణం, ఈయూ అలయెన్స్‌కు బస్సు సింబల్
● ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారానికి రెడీ
స్టేషన్ మహబూబ్‌గర్: ఆర్టీసీలో గు ర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎట్టకేలకు ఆయా యూనియన్లకు గుర్తుల ను కార్మిక శాఖ అధికారులు కేటాయించారు. టీడబ్ల్యూయూ కూటమి (రాష్ట్ర స్థాయిలో క్లాస్–3, రీజియన్ పరిధిలో క్లాస్–6)కి బాణం దక్కగా.. ఈయూ అలయెన్స్ (క్లాస్–3) కు బస్సు, (క్లాస్–6) కు నిచ్చెన గుర్తు ఖరారయ్యాయి. ఈ క్రమంలోనే బుధవారం ఆయా కూటములకు చెందిన ఇద్దరేసి ప్రతినిధులకు డమ్మీ బ్యాలెట్ పేపర్లు, ఓటర్ల తుది జాబితాను జిల్లా కార్మిక శాఖ అధికారులు అందజేశారు. మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలోని పది డిపోలకు గాను మొత్తం 3,098 మంది ఓటర్లు అర్హత సాధించిన విషయం విదితమే. కాగా, ప దేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రస్తు తం టీడబ్ల్యూ యూ కూటమిలో టీఎంయూ (అశ్వత్థామరెడ్డి వర్గం), ఎస్‌డబ్ల్యూఎఫ్ ఉన్నాయి. అలాగే ఈ యూ అలయెన్స్‌లో టీఎంయూ (థామస్‌రెడ్డి వర్గం), ఎన్‌ఎంయూ ఉన్నాయి. దీంతో ఈనెల 9న జరిగే ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచారానికి ఆయా కూటముల నాయకులు సిద్ధమయ్యారు. అక్టోబర్ 1 నుంచి ఆయా డిపోలలో ప్రచారం చేయనున్నారు.ఈ మేరకు అన్ని ఏ ర్పాట్లు చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకా రం ఒక్కో ఓటరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఇక రాష్ట్రస్థాయిలో గుర్తింపునకు క్లాస్–3, రీజియన్ స్థాయిలో గుర్తింపునకు క్లాస్–6గా పరిగణిస్తారు.


