మహబూబ్‌నగర్ క్రీడలు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభచాటాలని జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం అండర్–14, 17 విభాగాల జిల్లాస్థాయి స్కూల్ గేమ్స ఫెడరేషన్ ఫుట్‌బాల్ బాలబాలికల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపికలను ప్రారంభించి ఆయన మాట్లాడుతూ రానున్న ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో జిల్లా జట్లు చాంపియన్లుగా నిలవాలని కోరారు. ఎస్‌జీఎఫ్ క్రీడల్లో జిల్లా విద్యార్థులు రాణించి జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సెలక్షన్ కన్వీనర్ భానుకిరణ్, పీడీలు రామకృష్ణ, రాంకళ్యాణ్, రామేశ్వరయ్య, అన్వర్‌పాష, కోచ్ నికేష్, ప్రకాష్, నరేష్, ఖాజా తదితరులు పాల్గొన్నారు.


