పెద్దకొత్తపల్లి: మండలంలోని సాతాపూర్‌లో కొల్లాపూర్ ఎకై ్సజ్ అధికారులు సోమవారం రాత్రి దాడులు నిర్వహించి 3600 కేజీల నల్లబెల్లం స్వాధీనం చేసుకొని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు కొల్లాపూర్ ఎకై ్సజ్ సీఐ రామకృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఓ ట్రక్కులో నల్లబెల్లం అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు సాతాపూర్ వద్ద వాహనాన్ని నిలిపి తనిఖీలు చేయగా.. 120 బస్తాల్లో ఉన్న 3600 కేజీల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాహనాన్ని కొల్లాపూర్‌కు తరలించి అక్రమ రవాణాకు సహకరించిన బీహార్‌కు చెందిన రాంబాబురాయ్, కృష్ణయాదవ్, తెల్కపల్లికి చెందిన మహమ్మద్ అలీని అరెస్టు చేశామని, ప్రధాన నిందితుడు సునీల్‌కుమార్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. దాడులు నాగర్‌కర్నూల్ ఎకై ్సజ్ సూపరిండెంట్ వేణుగోపాల్‌రెడ్డి ఆదేశాలతో ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ జిన్నా నాగార్జున్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు.
రైలు ఢీకొని యువకుడి దుర్మరణం
మహబూబ్‌నగర్ క్రైం: పట్టాలు దాటుతున్న ఓ యువకుడిని రైలు ఢీకొట్టడంతో తీవ్ర గాయా లతో అక్కడిక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. రైల్వే ఎస్‌ఐ రాజు కథనం ప్రకారం.. నగరంలోని టీడీ గుట్ట సమీపంలో మంగళవారం గుర్తు తెలియని యువకుడు (35) పట్టా లు దాటుతుండగాని రైలు ఢీకొట్టింది. ఈ ప్ర మాదంలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, ఎవరికై నా సమా చారం తెలిస్తే వెంటనే రైల్వే పోలీస్ స్టేషన్‌లో లేదా 87126 58597 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.


