● ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడు మృతి
మానవపాడు: ముందు వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి వచ్చిన మరో బైక్ ఢీ కొట్టగా.. రైల్వే ఉద్యోగికి గాయాలు కాగా.., మరో వలస జీవి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ స్వాతి కథనం ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన ముకుట్‌రాజ్ మీనా మానవపాడు రైల్వేస్టేషన్‌లో ట్రాక్ మొయింటేనర్‌గా పనిచేస్తూ రైల్వేక్వార్టర్స్‌లో ఉంటున్నాడు. ఆదివారం రాత్రి 7:30 గంటల సమయంలో తన బైక్‌పై కిరాణా సరుకులు తీసుకొని క్వార్టర్స్‌కు రైల్వే అండర్‌పాస్ గుండా బయల్దేరాడు. అదే సమయంలో ప్రకాశం జిల్లా తంగడికి చెందిన బాలవెంకట పవన్‌గోపి(27) బైక్‌పై వేగంగా వచ్చి ముకుట్‌రాజ్ మీనా బైక్‌ను వెనుక నుంచి ఢీ కొట్టాడు. దీంతో పవన్‌గోపి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వెంటనే స్థానికులు అంబులెన్స్‌లో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కొంతకాలంగా పవన్‌గోపి జాతీయరహదారి నిర్మాణంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై ముకుట్ రాజ్ మీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
నీటి బకెట్‌లో
పడి చిన్నారి మృతి
కేటీదొడ్డి: ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ఓ చిన్నారి నీటి బకెట్‌లో పడి మృతిచెందింది. ఈ విషాదకర ఘటన కేటీదొడ్డి మండలం కొండాపురంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కొండాపురం గ్రామానికి చెందిన అర్చన – మహేశ్ దంపతులు తమ కూతురు రక్షిత (18 నెలలు)ను ఇంటి వద్ద నాన్నమ్మతో ఉంచి వ్యవసాయ పొలానికి వెళ్లారు. ఈ క్రమంలో ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారి కొంత సమయానికి కనిపించకుండా పోవడంతో నాన్నమ్మ ఇంటి పరిసరాల్లో వెతకగా.. నీటి బకెట్‌లో తలకిందులుగా పడి కనిపించింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతిచెందింది. వివాహమైన నాలుగేళ్లకు జన్మించిన రక్షిత అకాలమృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
అనుమానాస్పదంగా వలస కూలీ మృతి
రాజాపూర్(బాలానగర్): అనుమానాస్పదంగా వలస కూలీ మృతిచెందిన ఘటన మంగళవా రం బాలానగర్ శివారులో శివారులో చోటు చేసుకుంది. బాలానగర్ ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. పెద్దాయపల్లి శివారులోని బృందావన్ టౌన్‌షిప్‌లో ప్లాట్‌నెంబర్ 117, 129లో మినీ పంక్షన్‌హాల్ నిర్మిస్తున్నారు. యూ పీకి చెందిన బీరేంద్ర లాల్‌సాహెబ్ బెన్ వంశీ(42) ఏడాదిగా మేసీ్త్ర పనులు చేస్తున్నాడు. నెలక్రితం సొంతూరుకు వెళ్లి తిరిగి వారం క్రితం ఇక్కడికి వచ్చి పనుల్లో చేరాడు. తన వెంట వచ్చేటప్పుడు ఇక్కడ పనిచేసేందుకు యూ పీకి చెందిన వివేక్ సింగ్‌ను తీసుకొచ్చి ఇద్దరు పనిచేసేవారు. అయితే మంగళవారం ఉద యం టౌన్‌షిప్‌లోని ఫస్ట్‌ఫ్లోర్‌లో రవి తల వెనక భాగంలో రక్తగాయమై చనిపోయి ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లి చూడగా.. మృతదేహాన్ని పరిశీలించి అక్కడ ఎవరెవరు ఉన్నారో ఆరా తీయగా మృతుడితోపాటు అతని వెంట పనికోసం వచ్చిన వివేక్‌సింగ్ కనిపించక పోవడంతో అతనుగానీ, ఎంకెవరైనా మృతుడి తలపై పదునైన ఆయుధంతో కొట్టి చంపినట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు. ప్లాట్ యజమాని కొండని భాస్కర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


