కొల్లాపూర్:పితృవియోగంతో బాధపడుతున్న కొల్లా పూర్ మాజీ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్‌రెడ్డిని ఆదివారం పలువురు ప్రముఖులు పరామర్శించారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్.వంశీకృష్ణ, ఎమ్మెల్సీ లు చల్లా వెంకట్రామిరెడ్డి, గోరటి వెంకన్న, ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాల్‌నర్సింహ సింగోటం వ్యవసా య క్షేత్రంలో వారు హర్షవర్ధన్‌రెడ్డిని కలిసి సాను భూతి తెలిపారు.ఆయన తండ్రి భీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారివెంట పలువురు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.


