మరికల్: ఆర్‌ఎంపీతో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో మరొక ఆర్‌ఎంపీ కింద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరికల్ మండలంలోని చిత్తనూర్ లో జరిగింది. పూర్తి వివరాలు.. మాగనూర్‌కు చెందిన కమ్మరి వెంకటేశ్(19) చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్‌లో ఉంటున్న పిన్నితో కలిసి ఉంటూ.. చిత్తనూర్, దమగ్నాపూర్‌లో ప్రాథమిక వైద్య సేవలందిస్తున్న నర్వ మండలం కుమార్‌లింగంపల్లికి చెందిన గంగాధర్ అనే ఆర్‌ఎంపీ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల దమగ్నాపూర్‌లో ఉన్న మరో ఆర్‌ఎంపీ తమ గ్రామంలో వైద్య సేవలు చేస్తే ఊరుకోమని వెంకటేశ్‌ను హెచ్చ రించాడు. దీంతో మనస్తాపానికి గురైన వెంకటేశ్ ఇరువురి సంభాషణను రికార్డు చేసి తన తల్లికి శనివా రం ఫోన్‌లో పంపించాడు. అనంతరం చిత్తనూర్‌లో అద్దెకు ఉంటున్న గదిలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఆర్‌ఎంపీ గంగాధర్ ఫోన్ చేసినా ఎంతకూ లిఫ్ట్‌చేయకపోవడంతో స్థానికులకు సమాచారం ఇచ్చాడు. వారు ఇంటికి వెళ్లి చూడగా వెంకటేశ్ ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచానామా నిర్వహించారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ రామ్‌లాల్‌నాయక్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
వృద్ధుడు మృతి
పెద్దకొత్తపల్లి: మండలంలో ని గంట్రావుపల్లి స్టేజీ సమీపంలో శనివారం రాత్రి గుర్తు తెలి యని వాహనం ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతిచెందినట్లు ఎస్‌ఐ సతీష్ తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం శాగాపూర్‌రకు చెందిన కానమోని జయన్న(55) శనివారం గ్రామం నుంచి టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై సాతాపూర్‌కు వెళ్తుండగా.. గంట్రావుపల్లి స్టేజీ దగ్గర గుర్తు తెలియని వాహనం టీవీఎస్ ఎక్స్‌ఎల్‌ను ఢీ కొట్టడంతో జయన్న తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వ్యక్తి ని 108 అంబులెన్స్‌లో కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి జయన్న మృతిచెందినట్లు నిర్ధారించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. ఇట్టి ఘటనపై మృతుడి భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం అనంతరం ఆదివారం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు.
హైదరాబాద్‌లో
అంకమోనికుంట వాసి మృతి
వెల్దండ: మండలంలోని అంకమోనికుంట గ్రామానికి చెందిన గోలి గోపాల్‌రెడ్డి(55) ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని బీఎన్‌రెడ్డి సాగర్ కాంప్లెక్స్ వద్ద గోపాల్‌రెడ్డి రోడ్డు దాటుతుండగా బొలెరో వాహనం ఢీకొట్టగా.. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గోపాల్‌రెడ్డి మృతితో స్వగ్రామమైన అంకమోనికుంటలో విషాధం నెలకొంది.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాలిక మృతి
అమ్రాబాద్: మహబూబ్‌నగర్ షాషాబ్‌గుట్టకు చెందిన వజిహాజబిన్(16) అనే బాలిక ఆగస్టు 20న మండలంలోని మన్ననూర్‌కు బంధువుల ఇంటికి వచ్చి స్కూటీ నడుపుతుండగా సమీపంలో నిరంజన్‌షావలి దర్గా వద్ద ప్రమాదవవాత్తు కిందపడి తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం మృతి చెందింది. వజిహాజబిన్ తల్లి సాజిదాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హన్మంత్‌రెడ్డి తెలిపారు.
చికిత్స పొందుతూ
మృతి.. కేసు నమోదు
వనపర్తి రూరల్: చిక్సిత పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన వనపర్తి పట్టణంలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్‌ఐ హృషికేశ్ తెలిపిన వివరాలు.. స్థానిక మరికుంట కాలనీకి చెందిన మారోజు భాస్కర్‌చారి (58) ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తాగుడుకు బానిసై ఈ నెల 18న మధ్యాహ్నం గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం మహబుబ్‌నగర్‌కు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా శనివారం మృతి చెందారు. మృతుడి కుమారుడు శివమణి ఆదివారం రూరల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
గోపాల్‌రెడ్డి (ఫైల్)


