బతుకుకు ‘బ్లాక్‌’ స్పాట్‌..! | - | Sakshi
Sakshi News home page

బతుకుకు ‘బ్లాక్‌’ స్పాట్‌..!

Sep 21 2026 6:47 AM | Updated on Sep 21 2026 6:47 AM

బ్లాక్‌ స్పాట్‌ అంటే..

మహబూబ్‌నగర్‌ క్రైం: జిల్లాలో వాహనదారులు చే స్తున్న చిన్నపాటి తప్పిదాలతో రహదారులు రక్తసిక్తం అవుతున్నాయి. కొద్దిసేపట్లో గమ్య స్థానానికి చేరుకోవాల్సిన వాహనదారులు అక్కడికక్కడే మృత్యు ఒడికి చేరడం.. కొందరు క్షతగాత్రులుగా మారి ఆస్పత్రికి వెళ్తున్నారు. జిల్లాలో జాతీయ రహదారి–44 సుమారుగా 80 కిలోమీటర్లు ఉండగా.. ఈ మార్గంలో 15 మేజర్‌ బ్లాక్‌ స్పాట్లను పోలీసులు గుర్తించారు. ప్రధానంగా జడ్చర్ల నుంచి మూసా పేట మధ్య ఇటీవల అధికంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దివిటిపల్లి నుంచి భూత్పూర్‌ మధ్య జాతీయ రహదారి పూర్తిగా ఏటావాలుగా ఉండటం, బ్రిడ్జిల నిర్మాణ పనుల వల్ల రాత్రి వేళ సరైన లైటింగ్‌, రేడియం స్టిక్కర్స్‌ లేక ముందు వెళ్తున్న వాహనాలు సడెన్‌గా బ్రేక్‌లు వేస్తుండడంతో వెనుక వచ్చే వాహనాలు అదుపు తప్పి ఢీకొంటున్నాయి.

● జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు రో డ్డు ప్రమాద మరణాల కేసులు 165 నమోదు కాగా.. 177 మంది దుర్మరణం పాలయ్యారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కేసులు 216 నమోదు కాగా.. 361మంది క్షతగాత్రులయ్యారు. మిగిలినవి 59 కేసులు నమోదు కాగా వీటిలో 440 మంది వాహనదారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అత్యధికంగా మహబూబ్‌నగర్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 33 మంది మరణించగా.. జడ్చర్లలో 29, భూత్పూర్‌లో 28, రాజాపూర్‌ పరిధిలో 11మంది మృతి చెందారు.

ప్రమాదకరమైన బ్లాక్‌ స్పాట్‌ ఇవే..

బాలానగర్‌ హిల్‌పార్క్‌, బాలానగర్‌, పెద్దాయిపల్లి, కేతిరెడ్డిపల్లి, రాజాపూర్‌, గొల్లపల్లి, మాచారం, బూ రెడ్డిపల్లి, చిట్టిబోయిన్‌పల్లి, తాటిపర్తి, పోతుల మడుగు, శేరిపల్లి, తాటికొండ స్టేజీ, మూసాపేట, వేముల–సంకలమద్దిఎక్స్‌రోడ్లలో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.

● జాతీయ రహదారి 167పై 13 చోట్ల బ్లాక్‌స్పాట్స్‌ గుర్తించారు. దీంట్లో మిడ్జిల్‌, గంగాపూర్‌, సిగ్నల్‌ గడ్డ, మయూరీ పార్క్‌ మలుపు, హౌజింగ్‌బోర్డు, హనుమాన్‌పుర ఎక్స్‌రోడ్‌, ఆర్టీఏ కార్యాలయం మలుపు, ఆల్‌మదీన కళాశాల, ధర్మపూర్‌ టర్నింగ్‌, చౌదర్‌పల్లి స్టేజీ, కోడూర్‌ స్టేజీ, కోటకదిర స్టేజీ, మణ్యంకొండ స్టేజీ దగ్గర తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు తేల్చారు.

జాతీయ, రాష్ట్ర రహదారులు సుమారు 500 మీటర్ల పొడవు ఉన్న ప్రాంతం. మూడేళ్ల కాలంలో కలిపి అయిదు రోడ్డు ప్రమాదాలు జరిగినా లేదా మూడేళ్లలో పది మంది మరణించినా ఆ ప్రాంతాన్ని(మరణాలు, తీవ్ర గాయాలతో కూడినవి) బ్లాక్‌స్పాట్‌గా గుర్తిస్తారు. జిల్లా ఎన్‌హెచ్‌ 44పై పోలీసులు గుర్తించిన 15బ్లాక్‌ స్పాట్స్‌లో మూడేళ్ల కాలంలో 220 ప్రమాదాలు జరిగితే.. 180 మంది మృతి చెందారు.

ఆగస్టు 8న శేరిపల్లి సమీపంలో బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతుండగా.. ఆరు వాహనాలు వెనుక నుంచి ఒకదానికి ఒకటి బలంగా ఢీకొన్నాయి.

ఆగస్టు 14న భూత్పూర్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు బోల్తాపడటంతో 15మందికి గాయాలు కాగా.. ఇద్దరు యువతులకు చేతులు తెగిపోయాయి.

ఆగస్టు 26న భూత్పూర్‌ బ్రిడ్జి రోడ్డుపై నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి బైక్‌ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు.

సెప్టెంబర్‌ 7న భూత్పూర్‌ బ్రిడ్జిపై డీసీఎంను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు.

ఈనెల 10న జడ్చర్ల నుంచి కర్నూల్‌కు మేకల లోడుతో వెళ్తున్న డీసీఎం డ్రైవర్‌ నిద్రమత్తులో సూచిక బోర్డు దిమ్మెను ఢీకొట్టడంతో బోల్తాపడి అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఒక వ్యక్తితో పాటు 250 మేకలు సజీవ దహనం అయ్యాయి.

ఎన్‌హెచ్‌–44పై పెరిగిన

ప్రమాదాల తీవ్రత

దివిటిపల్లి నుంచి మూసాపేట

మధ్య అధికం

బ్రిడ్జిల నిర్మాణాలు, సూచిక బోర్డులు, రేడియం స్టిక్కర్స్‌ కరువు

9 నెలల కాలంలో 177 మంది మృతి

బాలానగర్‌ నుంచి వెల్టూర్‌ స్టేజీ వరకు 80 కిలోమీటర్ల దూరంలో 15 ప్రమాద స్థలాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement