● కారు ఢీకొని చిన్నారి మృతి..
నానమ్మకు తీవ్రగాయాలు
కడ్తాల్: రోడ్డు ప్రమాదంలో మనవరాలు మృతిచెందగా, నానమ్మ తీవ్రంగా గాయపడిన సంఘటన కడ్తాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని తిరుమలగిరి గ్రామానికి చెందిన పొలం భాగ్యమ్మ తన మనవరాలు కనిష్క(5)తో కలిసి ఆదివారం మైసిగండిలో బంధువులు ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. అమ్మవారి దర్శనం అనంతరం సాయంత్రం తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు శ్రీశైలం– హైదరాబాద్ జాతీయ రహదారిపై బస్టాండ్ వద్ద రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వైపు అతి వేగంగా వెళ్తున్న కారు వారిని ఢఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కనిష్క మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదిరెడ్డి తెలిపారు.


