గడువులోగా రీసర్వే పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా రీసర్వే పూర్తి చేయాలి

Sep 12 2026 1:00 AM | Updated on Sep 12 2026 1:00 AM

అడ్డాకుల: మూసాపేట మండలం కొమిరెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న రీసర్వే పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ హరిప్రియ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొమిరెడ్డిపల్లిలో జరుగుతున్న రీసర్వే పనులను ఆమె పరిశీలించారు. రీసర్వే పనుల పురోగతిపై అధికారులతో వివరాలను తెలుసుకున్నారు. నిర్ధేశిత నిబంధనలు, మార్గదర్శకాల మేరకు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. రీసర్వేలో భూ వివరాల నమోదును క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రీసర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సిబ్బందికి ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ నవీన్‌, తహసీల్దార్‌ రాజునాయక్‌, ఎంపీడీఓ కృష్ణయ్య, స్థానిక సర్పంచ్‌ బగ్గి కమలమ్మ, మాజీ ఎంపీపీ బగ్గి కృష్ణయ్య, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement