● ‘ఎవరు చెబితే.. హైమాస్ట్‌లు’
కథనంపై తీవ్ర చర్చ
● విచారణ జరిపిస్తామన్న కమిషనర్
రామాంజులారెడ్డి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: కార్పొరేషన్ పరిధిలో పెద్దఎత్తున ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్ల బాగోతంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఎక్కడపడితే అక్కడ.. అవసరం లేనిచోట్ల కూడా వాటిని ఏర్పాటు చేశారని శుక్రవారం ‘సాక్షి’లో ‘ఎవరు చెబితే హైమాస్ట్‌లు’ కథనం కార్పొరేషన్‌లో ఒకింత కలకలం సృష్టించింది. కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో వీధిలైట్లు ఉండగా అవి కాకుండా అనవసరంగా హైమాస్ట్ లైట్లు ఎందుకు ఏర్పాటు చేశారని, ఎవరు చెబితే ఏర్పాటు చేశారనే విషయంపై అటు కార్పొరేటర్లు, అధికారుల మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. దీనిపై కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ రామాంజులారెడ్డి స్పందిస్తూ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో ఎక్కడెక్కడ హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు.. ఎక్కడ అవసరం మేరకు వినిగిస్తున్నారు.. అనవసరంగా ఏవైనా ఉన్నాయా.. అనే దానిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామన్నారు. నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సాక్షిలో ప్రచురితమైన కథనం


