● 24న పీయూలో ఉద్యమకారుల
సమ్మేళనం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): తెలంగాణ ఉద్యమకారుల కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గుర్తింపు వస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈనెల 24న జరుగనున్న తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం పోస్టర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఎన్నికల్లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామన్నారు. ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా కోకన్వీనర్ నాచా శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతు ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఓ కమిటీని వేసినట్లు తెలిపారు. ఈ కమిటీ సమావేశం ఈనెల 24న పాలమూరుయూనివర్సిటీలో జరుగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, గౌరవ అతిథులుగా కే.కేశవరావు, కమిటీ సభ్యులు ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, రాములునాయక్, అద్దంకి దయాకర్, శోభన్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ఉద్యమకారుల కమిటీ చైర్మన్ పిడమర్తి రవి హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రహీం ఓయూ జేఏసీ అధ్యక్షులు, రాములు, అన్వర్, గడ్డమీది గోపాల్, బ్రహ్మం, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.


