డీఎఫ్‌ఓగా బాధ్యతలు స్వీకరించిన నవీన్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

డీఎఫ్‌ఓగా బాధ్యతలు స్వీకరించిన నవీన్‌రెడ్డి

Sep 11 2026 11:15 AM | Updated on Sep 11 2026 11:15 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: సుమారు రెండు నెలల తర్వాత ఎట్టకేలకు కొత్త రెగ్యులర్‌ డీఎఫ్‌ఓగా మందాడి నవీన్‌రెడ్డి నియమితులయ్యారు. గురువారం జిల్లా అటవీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్‌ ఖుష్బూగుప్తాను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం అటవీశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అటవీ భూములను ఆక్రమించి, అక్రమ చెట్ల నరికివేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయడంతో పాటు జిల్లావ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచేందుకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామన్నారు. కాగా, ఈయన యూపీఎస్సీ ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) 2019 బ్యాచ్‌లో అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంక్‌ సాధించారు. గతంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ (ఏటీఆర్‌) లో విధులు నిర్వహించిన సమయంలో వేసవి తీవ్రతలో వన్యప్రాణులకు తాగునీటి కొరత లేకుండా అటవీ ప్రాంతంలో సోలార్‌ బోర్లను ఏర్పాటు చేయించారు. వాటి ద్వారా నీటి తొట్టె (సాసర్‌ పిట్స్‌)లను ఎప్పటికప్పుడు నింపేలా చర్యలు తీసుకున్నారు.

రేపు ఉమ్మడి జిల్లా ఖోఖో క్రీడాకారులు ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జడ్చర్ల మండలంలోని పెద్ద ఆదిరాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఈనెల 12వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్రస్థాయి ఖేలో ఇండియాలో పాల్గొనే ఉమ్మడి జిల్లా ఖోఖో క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఖోఖో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఉబేదుల్లా కొత్వాల్‌, జీఏ విలియం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు 01.01.2008 తర్వాత జన్మించిన వారై ఉండాలని పేర్కొన్నారు. క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, పదోతరగతి మెమో, ఆధార్‌కార్డుతో ఎంపికలకు హాజరుకావాలని, మిగతా వివరాల కోసం 99853 75737 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఎంపికయ్యే క్రీడాకారులు సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఈనెల 16న (బాలురు), 17న (బాలికలు) జరిగే రాష్ట్రస్థాయి సెలక్షన్స్‌లో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

13న ‘కబడ్డీ’ జట్టు ఎంపిక

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్‌ స్టేడియంలో ఈనెల 13వ తేదీన ఉదయం 9.30 గంటలకు జిల్లాస్థాయి జూనియర్‌ బాలు ర, సబ్‌ జూనియర్‌ బాలికల జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు బి.శాంతికుమార్‌, ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు వచ్చే జూనియర్‌ బాలురు 05.11.2006 తర్వాత పుట్టినవారై 75 కేజీల లోపు బరువు ఉండాలని, సబ్‌ జూనియర్‌ బాలికలు 13.12.2010 తర్వాత పుట్టిన వారై 55కేజీల లోపు బరువు ఉండాలని పేర్కొ న్నారు. క్రీడాకారులు ఆధార్‌కార్డు, ఎస్‌ఎస్‌సీ ఒరిజనల్‌ మెమో, జనన ధ్రువీకరణ, బోనఫైడ్‌ సర్టిఫికెట్లతో ఎంపికలకు హాజరుకావాలని కోరారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఈనెల 26 నుంచి 29 వరకు జూనియర్‌ బాలురు, సబ్‌ జూనియర్‌ బాలికల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఉంటాయని తెలిపారు.

గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: గిరిజన నిరుద్యోగ యువత కోసం బ్యాక్‌లాగ్‌ పోస్టుల్లో ఉన్న ఖాళీలన్నీ వెంటనే భర్తీ చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ధర్మనాయక్‌ కో రారు. గురువారం జిల్లా గిరిజన సంఘం కార్యాలయంలో జరిగిన మహాసభలో ఆయన మాట్లాడారు. ఏటా విద్యార్థులు విద్యను ము గించుకుని బయటకు వస్తున్నా ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రన్నారు. చివరకు ఉపాధిహామీ పథకంలో తల్లిదండ్రులతో కాలిసి పనికి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. అనేక ప్రైవేట్‌ కంపెనీలు వెలుస్తున్నా రిజర్వేషన్లు లేకపోవడంతో స్థానికంగా ఉపాధి దొరకక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సి వస్తోందన్నారు. ప్రైవేట్‌ రంగంలోనూ స్థానికంగా రిజర్వేషన్లు వర్తింపజేయాలన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు భీమ్లా, నాయకులు మెగావత్‌ దీప్లానాయక్‌, చందర్‌నాయక్‌, ముడావత్‌ మణికంఠ, కుమార్‌, పవన్‌, మోహన్‌, ఈశ్వర్‌, చందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement