చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద
నివాళులు అర్పిస్తున్న ఎంపీ డీకే అరుణ, కలెక్టర్ ఖుష్బూగుప్తా, మేయర్ మమత, తదితరులు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): చాకలి ఐలమ్మ ఆశయాలు స్ఫూర్తిదాయకం కలెక్టర్ ఖుష్బూగుప్తా, ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని పద్మావతి కాలనీలో గురువారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వారు నగర మేయర్ మమతతో కలిసి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చేసిన పోరాటాన్ని వారు స్మరించుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యసాహసాలతో పోరాడి, పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఐలమ్మ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.


