● జిల్లాలో 12న మూడు కోర్టుల్లోజాతీయ లోక్ అదాలత్
● 4 వేల కేసుల పరిష్కారానికి చర్యలు
పాలమూరు: జిల్లాలో ఈనెల 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా మహబూబ్‌నగర్ కోర్టులో ఐదు, దేవరకద్ర ఒకటి, జడ్చర్లలో ఒక బెంచీ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత వెల్లడించారు. జిల్లా కోర్టులోని న్యాయమూర్తి చాంబర్‌లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. ఈ ఏడాదిలో ఈ జాతీ య లోక్ అదాలత్ మూడోదని, జిల్లావ్యాప్తంగా 4 వేలు కేసులు రాజీ కోసం గుర్తించినట్లు తెలిపారు. ఇందులో ఇప్పటికే 200 కేసులు రాజీ చేశామని, మిగిలిన కేసులు ఈ నెల 12న ఉదయం 10గంటల నుంచి రాత్రి వరకు జరగనున్న లోక్ అదాలత్‌లో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. దీంట్లో రాజీ చేసుకోవడానికి వీలు కలిగిన అన్ని రకాల కేసులు పరిష్కారం చేసుకోవచ్చునని, ప్రధానంగా సివిల్, క్రిమినల్, డ్రంకన్ డ్రైవ్, చెక్‌బౌన్స్, ప్రమాద, బీమా, బ్యాంకు ఫ్రీలిటిగేషన్ వంటి కేసులు రాజీ చేసుకోవచ్చునని వివరించారు. భూమి చారిటబుల్ ట్రస్ట్ ఫిర్యాదు మేరకు వనపర్తి జిల్లాలో 12 మంది వెట్టి చాకిరి పనిచేస్తున్న గిరిజనులను తమ ప్రత్యేక టీం రక్షించినట్లు న్యాయమూర్తి తెలిపారు. న్యాయమూర్తి ఇందిర పాల్గొన్నారు.


