మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏబీవీపీ పీయూ శాఖ కార్యదర్శి కావలి కిషోర్ డిమాండ్ చేశారు. గురువారం ఏబీవీపీ నాయకులు పీయూ రిజిస్ట్రార్ రమేష్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ సిబ్బంది కొరత కారణంగా పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రక్రియ, విద్యార్థుల సర్టిఫికెట్‌ల జారీ, పరిపాలన సేవల్లో తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు. శివమార్తండ్, యువకుమార్, తదితరులు పాల్గొన్నారు.
పెంచిన ఫీజులను తగ్గించాలి
గర్‌ల్స్ హాస్టల్‌లో చదువుతున్న పేద విద్యార్థులకు అధికారులు హాస్టల్ ఫీజులను ఒకే సారి పెంచడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే తగ్గించాలని కోరుతూ ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. బాలికల హాస్టల్ నుంచి అడ్మినిస్ట్రేషన్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేశారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్గ సభ్యులు మహేశ్వరి మాట్లాడుతూ ఫీజులు పెంచి ఆర్థిక భారం మోపడం సరికాదన్నారు. మౌలిక వసతులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో కలామంచ్ కన్వీనర్ శైలజ, క్రితిక, చైతన్య, ప్రియ విద్యార్థులు పాల్గొన్నారు.


