మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో క్రీడాకారులు ప్రతిభచాటాలని ఉమ్మడి జిల్లా యోగా సంఘం అధ్యక్షులు ఆనంద్‌కుమార్‌గౌడ్ అన్నారు. కరీంనగర్‌లో శుక్ర, శనివారం జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్ యోగా పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా క్రీడాకారులను ఇండోర్ స్టేడియంలో ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆనంద్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ యోగా క్రీడను ఎంచుకున్నందుకు మీరెంతో అదృష్టవంతులని అన్నారు. యోగా చేయడం వల్ల మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చని అన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా యోగా సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, కార్యనిర్వాహక చైర్మన్ కె.రాములు, సభ్యులు బాలరాజయ్య, పాండురంగం, శరణ్య, పవన్‌కుమార్, స్వరూపారాణి పాల్గొన్నారు.


