మహబూబ్‌నగర్ క్రీడలు: మహారాష్ట్రలోని షిరీడీలో ఈనెల 7 నుంచి 10 వరకు జరిగిన జాతీయస్థాయి గోగేమ్ పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటి పతకాలు సాధించారు. ఈ పోటీల్లో క్రీడాకారులు మూడు బంగారు, ఒక రజతం, ఒక కాంస్య పతకాన్ని సాధించి సత్తాచాటారు. సింగిల్ విభాగం సబ్ జూనియర్‌లో సిటి.లలితేష్ బంగారు పతకం, జె.అభిజిత్ కాంస్య పతకం, జూనియర్‌లో సబావత్ వర్షిత్ బంగారు పతకం, పి.రాహుల్ రజత పతకం, సీనియర్‌లో పి.రాజేష్ బంగారు పతకం సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను గోగేమ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఉపాధ్యక్షులు షకీల్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి గులాం అఫ్రోజ్ తదితరులు అభినందించారు.


