మహబూబ్‌నగర్ క్రీడలు: హెచ్‌సీఏ అండర్–23 మెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్స్ 4–డే టోర్నమెంట్‌లో జిల్లా క్రికెటర్ అబ్దుల్ రాఫే బిన్ అబ్దుల్లా ప్రతిభచాటాడు. టోర్నీలో టీమ్–బీకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అబ్దుల్ రాఫే అద్భుతమైన సెంచరీతో రాణించాడు. గురువారం టీమ్–సీ జట్టుతో ప్రారంభమైన మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో అబ్దుల్ రాఫే సెంచరీతో రాణించాడు. 220 బంతుల్లో 19 ఫోర్లు కొట్టి 129 పరుగులు చేసి సత్తాచాటాడు. టీమ్–బీ జట్టు 89 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. జిల్లా క్రికెటర్ అబ్దుల్ రాఫే సెంచరీ సాధించడంపై ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న మ్యాచుల్లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.
మార్కెట్‌లోకి న్యూ బాలెనో
పాలమూరు: వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా మారుతీ కంపెనీ మరో కొత్త మోడల్ న్యూ బాలెనో కారును మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. నగరంలోని మారుతీ నెక్సా షోరూంలో గురువారం శ్రీరామ జయరామ సంస్థల అధినేత బెక్కరి రాంరెడ్డి న్యూ బాలెనో కారును మారె్‌క్ట్‌లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ న్యూ బాలెనో కారు 1200 సీసీ ఇంజిన్, క్రోమ్ గ్రిల్, లెదర్ సీట్స్, లెవెల్ 2 అడాస్, రియర్ ఏసీవెంట్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఫ్రంట్ వెంటిలేటర్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. 360 వ్యూ కెమెరా, స్పేసియస్ క్యాబిన్, పెట్రోల్ వెర్షన్‌లో 24.77 కి.మీ. మైలేజ్ ఇస్తుందన్నారు. ఆరు రంగుల్లో అందుబాటులో ఉందని.. ఎక్స్ షోరూం ధర రూ. 6.09లక్షల నుంచి రూ. 9.99లక్షలకు లభిస్తుందన్నా రు. కార్యక్రమంలో సీఈవో విక్రమ్, జనరల్ మేనేజర్ తుకారాం, వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.


