గూడ్స్‌ రైలు కిందపడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

గూడ్స్‌ రైలు కిందపడి ఆత్మహత్య

Sep 10 2026 1:15 AM | Updated on Sep 10 2026 1:15 AM

మరికల్‌: గూడ్స్‌ రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరికల్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్‌ రైల్వే ఎస్‌ఐ రాజు తెలిపిన వివరాల మేరకు.. మరికల్‌కు చెందిన షేక్‌సద్దాం (30) మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మరికల్‌లోని రైల్వేస్టేషన్‌కు వచ్చి మహబూబ్‌నగర్‌ నుంచి రాయాచూర్‌ వెళ్తున్న గూడ్స్‌ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్‌ఐ తెలిపారు. సద్దాంకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

పిచ్చికుక్క దాడిలో

ఐదుగురికి గాయాలు

కందనూలు/ తాడూ రు: పిచ్చికుక్క దాడి చేసి అయిదుగురిని గాయపరిచిన ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెలితే.. తాడూరు మండలం బల్లాన్‌పల్లిలో ఓ పిచ్చికుక్క గ్రామంలో తిరుగుతూ బాలమ్మ, రేణుక, పండు, నిరంజన్‌, పార్వతమ్మపై దాడి చేసింది. గాయపరిచిన వారిని గ్రామస్తులు వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పిచ్చికుక్క దాడితో గ్రామస్తుల్లో భయాందోళన నెలకొంది. ఇప్పటికై నా పంచాయతీ అధికారులు స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

గడ్డిమందు తాగి ఆత్మహత్య

దేవరకద్ర: మండలంలోని కోయిల్‌సాగర్‌ గ్రామానికి చెందిన ఆవుల రవి (40) గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబకలహాలతో మంగళవారం గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబసభ్యులు గమనించి జిలా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందాడని ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

మృతదేహం లభ్యం

రాజాపూర్‌: మండల కేంద్రంలోని జాతీయ రహదా రి పక్కన గల మసీద్‌ సమీపంలో బుధవారం ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు రాజాపూర్‌ ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపారు. మృతదేహం పురుషుడిదని, వయసు 45–50 ఏళ్లల్లోపు ఉంటుందన్నారు. మృతుడి వివరాలు ఎవరికై న తెలిస్తే 87126 59347, 87126 59315 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ కోరారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ

దేవరకద్ర: మున్సిపాలిటీ పరిధిలోని కోయిల్‌సాగర్‌ రోడ్డులో నివాసం ఉంటున్న నట్టలి తిమ్మమ్మ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం శ్రీశైలం దైవ దర్శనాని కి వెళ్లారు. బుధవారం తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి, బీరువాలు తెరిచి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చా రు. గుర్తుతెలియని వ్యక్తులు 5 తులాల బంగారం, 80 తులాల వెండి, రూ.10 వేల నగదు దోచుకుపోయారని బాధితులు వాపోయారు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి క్లూస్‌ టీంతో వివరాలు సేకరించారు. సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement