మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస్‌కాలనీ పార్క్‌ను రాత్రి సమయంలో పలువురు వ్యక్తులు ధ్వంసం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్క్ స్థలం తమదంటూ పలువురు గతంలో కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం సంబంధిత వ్యక్తుల వద్ద ఉన్న ఆధారాలు, ఇతర డాక్యుమెంట్లు పరిశీలించాలని, వాస్తవాలను తేల్చి తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులను కోర్టు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా.. పలువురు వ్యక్తులు రాత్రివేళలో జేసీబీలు, ఇతర సామగ్రితో వాకింగ్ ట్రాక్‌ను ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఏపుగా పెరిగిన చెట్లను సైతం తొలగించారు. స్థానికులు విషయాన్ని కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఓ మహిళతో సహా మొత్తం 18 మందిపై క్రిమినల్ కోసులు నమోదు చేసినట్లు రూరల్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ విషయంపై కార్పొరేషన్ కమిషనర్ రామాంజులారెడ్డిని వివరణ కోరగా.. పార్క్ స్థలంపై కోర్టుకు వెళ్లిన పలువురు రాత్రి వేళల్లో చెట్లు, వాకింగ్ ట్రాక్‌ను ధ్వంసం చేశారని, వారిపై రూరల్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కోసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
శ్రీనివాస్‌కాలనీ పార్కులో మిగిలిన చెట్ల మొదళ్లు
పార్క్ స్థలం తమదంటూ కోర్టుకు వెళ్లిన పలువురు వ్యక్తులు
ఇంతలోనే పార్క్‌లో చెట్లు,
వాకింగ్ ట్రాక్ తొలగింపు
కార్పొరేషన్ అధికారులు ఫిర్యాదుతో 18 మందిపై కేసులు


