జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న ప్రసవాల తీరు
● రెండేళ్లలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో 5,317 సిజేరియన్లు
● సాధారణ కాన్పులు 2,400 మాత్రమే..
● ప్రభుత్వ వైద్యులే ‘ప్రైవేట్’గా సాగిస్తున్న దందా
● ఆరోగ్యశాఖ లోపాలను ఎత్తిచూపుతున్న గణాంకాలు
కారణాలెన్నో..
అధిక మొత్తంలో బిల్లులు వసూలు చేయవచ్చనే ఆశతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యులు సాధారణ ప్రసవాల కంటే సిజేరియన్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
కొందరు మహిళలకు ఓపిక, ప్రసవ వేదన భరించడానికి సిద్ధంగా లేకపోవడం వంటివి కూడా కారణాలుగా ఉంటున్నాయి. నొప్పులు లేకుండా సులువుగా డెలివరీ అయిపోతుందనే అపోహతో స్వయంగా సిజేరియన్‌ను ప్రోత్సహిస్తున్నారు.
పిల్లలు ఫలానా రోజు, అనుకున్న నక్షత్రంలో పుట్టాలని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ముందుగానే ప్లాన్ చేసుకొని ఆ సమయానికి కచ్చితంగా ఆపరేషన్ ద్వారా పిల్లలను కనాలనే భావనలో ఉంటున్నారు.
తగినంత శారీరక శ్రమ లేకపోవడం, పోషకాహార లోపం, అనారోగ్య సమస్యలతో సిజేరియన్లు అనివార్యం అవుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.


