● 12న జాతీయ లోక్ అదాలత్‌నుసద్వినియోగం చేసుకోవాలి
మహబూబ్‌నగర్ క్రైం: పరస్పర అంగీకారంతో వివాదాలను సత్వరం పరిష్కరించుకునేందుకు ఈనెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డి.జానకి సూచించారు. కోర్టుల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రాజీ పడదగిన కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. దీంతో సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గుతుందన్నారు. లోక్ అదాలత్‌లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్, ఆస్తి, కుటుంబ, వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ, చెక్‌బౌన్స్, విద్యుత్ చౌర్యం తదితర కేసులను రాజీ చేసుకోవచ్చని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది రాజీ పడదగిన కేసులను గుర్తించి కక్షిదారులకు సకాలంలో నోటీసులు జారీ చేసి లోక్ అదాలత్‌కు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు.
కాళోజీకి ఎస్పీ నివాళి
తెలంగాణ ప్రజాకవి, సాహితీవేత్త కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎస్పీ డి.జానకి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాళోజీ తన రచనలు, కవిత్వం ద్వారా ప్రజల సమస్యలను సమాజం ముందుకు తీసుకొచ్చారని తెలిపారు. తెలంగాణ ప్రజల జీవన విధానం, సామాజిక పరిస్థితులు, ఆకాంక్షలను సాహిత్యంలో ప్రతిబింబిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్‌కుమార్, డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, ఆర్‌ఐలు కృష్ణయ్య, అశోక్ పాల్గొన్నారు.


