● సౌత్ ఏషియన్ డ్రిప్ట్‌బాల్ పోటీల్లో స్వర్ణం
● క్రీడాకారుడిని అభినందించిన
‘పేట’ కలెక్టర్ ప్రియాంక
నారాయణపేట: గ్రామీణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ క్రీడా వేదికపై సత్తా చాటాడు ధన్వాడ మండలం మందిపల్లి గ్రామానికి చెందిన యువ క్రీడాకారుడు బడుగు గౌరీశంకర్. నేపాల్ రాజధాని ఖాట్మండులో నిర్వహించిన సౌత్ ఏషియన్ డ్రిప్ట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించాడు. గౌరీశంకర్ విజయాన్ని కలెక్టర్ ప్రియాంక సోమవారం అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించడం జిల్లాకు గర్వకారణమన్నారు. భవిష్యత్‌లో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. యువత చదువుతో పాటు క్రీడలపైనా ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి వెంకటేష్‌శెట్టి తదితరులు పాల్గొన్నారు.


