కలెక్టరేట్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ రాస్తారోకో | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ రాస్తారోకో

Sep 8 2026 1:47 AM | Updated on Sep 8 2026 1:47 AM

గేట్‌ వద్ద మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను అడ్డుకున్న పోలీసులు

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఆ పార్టీ నాయకులను పోలీసులు ప్రధాన గేట్‌ వద్ద అడ్డుకున్నారు. లోపలికి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం బీఆర్‌ఎస్‌ నేతలు కలెక్టరేట్‌ ఎదుట రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడా న్ని ఖండించారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలు, పింఛన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రైతులు, ఉద్యోగు లు, ఉపాధ్యాయుల సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్ని స్తే ప్రభుత్వం గొంతు నొక్కుతోందని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు ప్రభుత్వ పెద్దలు విలువైన భూములను కబ్జా చేసేందుకు 22ఏ నిబంధనను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు తమ సమస్యలపై స్వేచ్ఛగా ప్రజావాణికి వెళ్లి వినతిపత్రాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్నా రు. వెలిగొండ ద్వారా ఏపీకి 12 టీఎంసీల నీరు తరలిపోతున్నా జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర ఎమ్మెల్యేలు స్పందించడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్‌గౌడ్‌, శివరాజ్‌, ఆంజనేయులు, కార్పొరేటర్లు ఈశ్వరయ్య, నవకాంత్‌, శరత్‌, నరేష్‌, నరేందర్‌, సత్యం, మధుమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement