● ‘రాగా ఫర్ ఇండియా’ పాదయాత్రకు ఘన స్వాగతం
స్టేషన్ మహబూబ్‌నగర్: దేశంలో న్యాయం, సమానత్వం, ప్రజా స్వామ్య పరిరక్షణ కోసం రాహుల్‌గాంధీ నిరంతరం పోరాడుతున్నార ని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. రాహుల్‌గాంధీ ఆలోచనలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హైకోర్టు న్యాయవాది, సామాజిక కార్యకర్త కాటూరి వెంకటేశ్వర్లు చేపట్టిన ‘రాగా ఫర్ ఇండియా పాదయాత్ర’ సోమవారం మహబూబ్‌నగర్‌కు చేరు కుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి న్యూటౌన్ వరకు నిర్వహించిన పాదయాత్రలో సంజీవ్ ముదిరాజ్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనే ధృఢ సంకల్పంతో వెంకటేశ్వర్లు చేపట్టిన పాదయాత్ర అభినందనీయమన్నారు. ఎండ, వాన, అలసటను లెక్కచేయకుండా దేశం కోసం వేల కిలోమీటర్లు నడుస్తున్న ఆయ న సంకల్పం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వెంకటేశ్వర్లు వేస్తున్న ప్రతి అడుగు ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, సమానత్వం, బలమైన దేశ నిర్మాణం దిశగా సాగుతున్న ఉద్యమానికి ప్రతీక అని అన్నారు. కార్యక్రమంలో మేయర్ గుమ్మాల మమత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్, నాయకులు చంద్రకుమార్‌గౌడ్, జహీర్ అఖ్తర్, బెక్కరి మధుసూదన్‌రెడ్డి, మినాజుద్దీన్, పసుల రాజు, ప్రవీణ్‌కుమార్, తాహెర్, ప్రశాంత్, మహేందర్ పాల్గొన్నారు.


