మాది పాలకొండ. సర్వే నంబర్ 73/ఏలో ఉన్న రెండు గుంటల భూమికి పాస్‌బుక్ ఇవ్వడం లేదు. ఇందుకోసం ఎనిమిదేళ్లుగా తిరుగుతున్నా అధికారులు స్పందించడం లేదు. భూ భారతి రికార్డుల్లో రెండు గుంటల భూమి చూపిస్తున్నా పాస్‌బుక్కు ఇవ్వడం లేదు. అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. – మొగులయ్య, పాలకొండ
ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి..
చిన్నరేవల్లిలో సర్వే నంబర్ 138లో మా పాలివాళ్లకు కలిపి ఎనిమిది ఎకరాల భూమి ఉంది. మా పాలివాళ్లు తమకు చెందిన భూమిని విక్రయించడంతో.. మా పేరుపై ఉన్న ఎకరం 30 గుంటల భూమిని ఆన్‌లైన్ నుంచి తొలగించారు. ఈ భూమి కోసం సంవత్సరాలుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కలెక్టరేట్ సూచించినా భూ భారతి ఆపరేటర్ నమోదు చేయడం లేదు.
– లింగమ్మ, చిన్నరేవల్లి, బాలానగర్ మండలం


