జాతీయ పోటీలకు రాష్ట్ర జట్ల పయనం | - | Sakshi
Sakshi News home page

జాతీయ పోటీలకు రాష్ట్ర జట్ల పయనం

Sep 6 2026 1:13 AM | Updated on Sep 6 2026 1:13 AM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: మహారాష్ట్రలోని షిర్డీలో ఈ నెల 7 నుంచి 10 వరకు జరిగే 4వ సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ జాతీయస్థాయి గోగేమ్‌ పోటీలకు రాష్ట్ర జట్లు బయలుదేరాయి. జిల్లా కేంద్రంలోని మాస్టర్‌ మైండ్స్‌ హైస్కూల్‌ ఆవరణలో శనివారం క్రీడా జట్లను పలువురు అభినందించారు. పోటీల్లో ప్రతిభ చాటి పతకాలు సాధించాలని ఆకాక్షించారు. అనంతరం మాస్టర్‌ మైండ్స్‌ హైస్కూల్‌ యాజమాన్యం క్రీడాకారులకు టీషర్టులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్‌ విజయలక్ష్మి, అకడమిక్‌ డైరెక్టర్‌ రాజేష్‌కుమార్‌, ప్రిన్సిపాల్‌ స్వరూప, వైస్‌ ప్రిన్సిపాల్‌ సుధారాణి, గోగేమ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహ్మద్‌షకీల్‌, ప్రధాన కార్యదర్శి గులాం అఫ్రోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

క్రీడాకారుల వివరాలు..

సబ్‌ జూనియర్‌ బాలుర సింగిల్‌ విభాగంలో జెట్టిగారి అభిజిత్‌, లలితేష్‌, జూనియర్‌ బాలుర సింగిల్‌లో సభావత్‌ వర్షిత్‌, రాహుల్‌, సీనియర్‌ పురుషుల విభాగం సింగిల్‌లో రాజేష్‌, మహ్మద్‌రాయన్‌ నజమ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement