కొల్లాపూర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేశామని రాష్ట్ర పంచాయతీరాజ్, సీ్త్ర, శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడాన్ని బీఆర్‌ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఉచిత బస్సుల్లో ప్రయాణిస్తే మహిళలు చెడిపోతున్నారంటూ ఆ పార్టీ నేత లు మాట్లాడుతున్నారని, మహిళలను ఇప్పటికీ వంటింటికే పరిమితం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన సభలో సీతక్క మాట్లాడారు. మహిళలు, పేదలను కించపరిచేలా మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ను ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణతో పాటు తెలంగాణ సంస్కృతిని కాపాడేందుకు త్వరలో ‘ప్రభాతభేరి’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపా రు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పారు. ఎంపీ మల్లు రవి మా ట్లాడుతూ.. కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా చర్యలు తీసుకుందని పేర్కొన్నారు.
లబ్ధిదారుల ఎంపిక
పారదర్శకంగా చేపట్టాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రెండు పడకల గదుల ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఎంపికను నిబంధనల ప్రకారం పారదర్శకంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి గృహనిర్మాణ శాఖ పీడీ ఉపేందర్‌రెడ్డి, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై సమీక్షించారు. ఇప్పటికే చేపట్టిన లబ్ధిదారుల ధ్రువీకరణ ప్రక్రియ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకే అర్హులను ఎంపిక చేయాలని, నిర్ణీత గడువులోగా ధ్రువీకరణ, ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఎంపికలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకత పాటించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
విద్యార్థులకు
న్యాయ అవగాహన సదస్సు
పాలమూరు: జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని షాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయమూర్తి డి.ఇందిర హాజరై బాలల చట్టాలు, హక్కులు, నల్సా చైల్డ్ యాక్ట్‌పై అవగాహన కల్పించారు. బాలలకు లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, అందుబాటులో ఉన్న న్యాయ సహాయం, సమస్యను చట్టపరంగా ఎలా ఎదుర్కోవాలనే అంశాలను వివరించారు.
2 యూనిట్లలో విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: జూరాలలో 2 యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. శనివారం ఎగువన ఒక యూనిట్ నుంచి 39 మెగావాట్లు, 101.283 మి.యూ., దిగువన ఒక యూనిట్ నుంచి 40 మెగావాట్లు, 87.534 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఇప్పటివరకు 188.817 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు.


