మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డికి ఘననివాళి | - | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డికి ఘననివాళి

Sep 5 2026 6:19 AM | Updated on Sep 5 2026 6:19 AM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: జిల్లా కేంద్రంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి వర్ధంతి నిర్వహించారు. పద్మావతీకాలనీలోని ఆయన విగ్రహానికి విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌, ఇతర నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా మహబూబ్‌నగర్‌ అభివృద్ధికి జగదీశ్వర్‌రెడ్డి కృషి చేశారన్నారు. డీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ.. జగదీశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ప్రజలకు ఎంతో సేవ చేసినట్లు తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో జగదీశ్వర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళలర్పించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో టీజీఎంఎఫ్‌సీ చైర్మన్‌ కొత్వాల్‌, మేయర్‌ మమత, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ అనిత, గ్రంథాలయ చైర్మన్‌ నర్సింహారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్‌రెడ్డి, అధికార ప్రతినిధి జహీర్‌ అక్తర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement