వన్డే లీగ్‌లో మహబూబ్‌నగర్‌ గెలుపు | - | Sakshi
Sakshi News home page

వన్డే లీగ్‌లో మహబూబ్‌నగర్‌ గెలుపు

Sep 5 2026 6:19 AM | Updated on Sep 5 2026 6:19 AM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: హైదరాబాద్‌లో జరుగుతున్న సీ–డివిజన్‌ వన్డే లీగ్‌ చాంపియన్‌షిప్‌లో హెచ్‌సీఏ డిస్ట్రిక్ట్‌–4 (మహబూబ్‌నగర్‌) జట్టు విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జిల్లా జట్టు 5 వికెట్ల తేడాతో విజయ్‌ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన విజయ్‌ జట్టు జిల్లా బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లను కోల్పోయింది. 48 ఓవర్లలో 9 వికెట్లకు 124 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన హెచ్‌సీఏ డిస్ట్రిక్ట్‌–4 జట్టు 29.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. జట్టులో రాంకుమార్‌చారి 49, అఫ్వాన్‌ 26 పరుగులు చేశారు. వన్డే లీగ్‌లో జిల్లా జట్టు విజయం సాధించడంపై ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్‌ హర్షం వ్యక్తం చేశారు. రానున్న మ్యాచుల్లో ఇదే స్ఫూర్తితో ఆడి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement