పట్టపగలే భారీ చోరీ | - | Sakshi
Sakshi News home page

పట్టపగలే భారీ చోరీ

Sep 5 2026 6:19 AM | Updated on Sep 5 2026 6:19 AM

కొత్తకోట రూరల్‌: మండల కేంద్రంలో పట్టపగలే భారీ చోరీ జరిగిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పాత ఎఫ్‌సీఐ గోదాం సమీపంలో నివాసం ఉంటున్న ఫాతిమా ఉదయం 11 గంటల సమయంలో వ్యక్తిగత పనుల నిమిత్తం వేరే ఊరికి వెళ్లి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చి చూడగా బీరువా తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించింది. బీరువాలోని 12 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురికావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న వనపర్తి డీఎస్పీ గిరిబాబు, సీఐ రమేష్‌, ఎస్‌ఐ విక్రమ్‌తో పాటు క్లూస్‌టీంతో దర్యాప్తు చేపట్టారు.

12 తులాల బంగారం అపహరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement