అలంపూర్ : వానాకాలం పత్తి పంట సాగులో సూక్ష్మధాతు లోపంతో పంట పసుపు రంగులోకి మారి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని మండల వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి అన్నారు. అయితే సూక్ష్మధాతు లోపాలను ముందస్తు జాగ్రత్తలతో నివారించవచ్చని సూచిస్తున్నారు.
మెగ్నీషియం :
మెగ్నీషియం పోషక లోపం ఉన్నప్పుడు ముదురు ఆకుల అంచులు నుంచి మధ్య భాగం పసుపు రంగులోకి మారి ఆకుల ఈనెలు మాత్రం ఆకుపచ్చగా తయారవుతాయి. ఆకులు ఎండుబారి రాలిపోతా యి. పోటాషియం లోపం ఎక్కువగా ఉ న్న నేలల్లో ఇలా ఆకులు రాలిపోతా యి. మెగ్నీషియం లోప నివారణకు లీటర్ నీటికి 10 గ్రాముల మెగ్నీ షియం సల్ఫేట్‌ను పంట వేసిన 45 నుంచి 75 రోజుల తర్వాత రెండు సార్లు పంటపై పిచికారీ చేయాలి.
జింకు లోపం : జింకు లోపం ఉంటే మొక్క, ఆకు ల మధ్య కనిపిస్తోంది. ఈనెల మధ్య భాగం పసుపు పచ్చగా మారుతుంది. కొమ్మ చివరి ఆకులు చిన్నవి గా ఉండి కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. సేంద్రియ పదార్థం తక్కువైన నేలలో సున్నం పాలు లేదా భాస్వరం ఎక్కువగా ఉన్న ఈ లోపం కనిపిస్తోంది. జింకు లోప నివారణకు ఆఖరి దుక్కిలో ఎకరాకు 20 కిలోలు జింకు సల్ఫేట్ వేయాలి. లేదా పంట మీద జింకు లోప లక్షణాలు గుర్తించిన వెంటనే లీటరు నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్‌ను 5 లేదా 6 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయడం ఉత్తమం.
బోరాన్ : ఈ పోషక లోపం వలన కొత్తగా పెరిగే చివరి మొగ్గలు దెబ్బతింటాయి. మొగ్గల పెరుగుద ల ఆగిపోయి పక్క మొగ్గల నుంచి అనేక కొమ్మలు వచ్చి మొక్క చివర గుబురుగా కనిపిస్తోంది. ఆ కులు, కాండాలు, చివరి మొగ్గలు, రంగు, రూపాలు మా రిపోయి అన్ని భాగాలు ముతకగా దళసరిగా, పెళుసుగా ఉండి కుళ్లిపోయిన ట్లు కనిపిస్తే అది బోరాన్ లోప మని గుర్తించవచ్చు. బోరాన్ లోప నివారణకు పంట వేసిన 60 నుంచి 90 రోజుల తర్వాత లీటరు నీ టికి 1 గ్రా బోరాక్స్ కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు సార్లు పిచికారీ చేస్తే తగ్గిపోతుంది.
సాగుచేసిన పత్తి పంట
పత్తిలో మెగ్నీషియం లోపం (ఫైల్)
పాడి–పంట


