ఐపీఎల్‌ టికెట్లు ఇప్పిస్తానంటూ రూ.లక్ష టోకరా | - | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ టికెట్లు ఇప్పిస్తానంటూ రూ.లక్ష టోకరా

Sep 5 2026 6:19 AM | Updated on Sep 5 2026 6:19 AM

అడ్డగుట్ట: ప్రముఖులతో దిగిన ఫొటోలు చూపిస్తూ ప్రజలను మోసం చేసి డబ్బులు దండుకుంటున్న వ్యక్తిని లాలాగూడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే... వనపర్తి జిల్లాకు చెందిన బి.మోహన్‌లాల్‌(38) కొంత కాలం క్రితం నగరానికి వచ్చి కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నాడు. తాను ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ అని, ప్రముఖులు, రాజకీయ నాయకులు, పోలీస్‌ ఉన్నతాధికారులతో మంచి పరిచయాలు ఉన్నాయని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. వారితో దిగిన ఫొటోలను సైతం సోషల్‌ మీడియాల్లో పోస్ట్‌ చేస్తూ ప్రజలను మోసం చేసేవాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని, విదేశాలకు పంపిస్తానని మభ్యపెడుతూ డబ్బులు తీసుకొని ముఖం చాటేసేవాడు. మే నెలలో ఉప్పల్‌లో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌కు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 8 లాంజ్‌ టికెట్లు ఇప్పిస్తానని నాగోల్‌ ప్రాంతానికి చెందిన షన్ముక సిద్ధార్థ్‌ అనే యువకుడిని నమ్మించి రూ.1.70 లక్షలు అడిగాడు. మే 21న తార్నాకలో రూ.లక్ష నగదు చెల్లించాడు. మరుసటి రోజు నుంచి మోహన్‌లాల్‌ తప్పించుకొని తిరుగుతుండేవాడు. దీంతో బాధితుడు సిద్ధార్థ్‌ లాలాగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మూడు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న మోహన్‌లాల్‌ను ఎట్టకేలకు లాలాగూడ పోలీసులు కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లో అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ప్రముఖులతో దిగిన ఫొటోలు చూపిస్తూ ఎర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement