జోగుళాంబ జిల్లా వాసికి అరుదైన గౌరవం | - | Sakshi
Sakshi News home page

జోగుళాంబ జిల్లా వాసికి అరుదైన గౌరవం

Sep 4 2026 7:23 AM | Updated on Sep 4 2026 7:23 AM

అమెరికా బయోటెక్‌ సంస్థ

న్యూరిక్స్‌లో వైస్‌ ప్రెసిడెంట్‌గా

డాక్టర్‌ వడ్ల వీరేంద్ర బ్రహ్మచారి

ఇటిక్యాల: జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మునగాల గ్రామానికి చెందిన డాక్టర్‌ వడ్ల వీరేంద్ర బ్రహ్మచారికి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ న్యూరిక్స్‌లో వైస్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పూర్తి చేసిన ఆయన.. గత రెండు దశాబ్దాలుగా అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల్లో పనిచేస్తూ శాస్త్రవేత్తగా అంచెలంచెలుగా ఎదిగారు. క్యాన్సర్‌, వాపు సంబంధిత వ్యాధులకు వినూత్న ఔషధాల అభివృద్ధిపై న్యూరిక్స్‌ దృష్టి సారిస్తోంది. సంస్థలో సుమారు 20 మంది శాస్త్రవేత్తలతో కలిసి ఫేజ్‌–1, 2, 3 క్లినికల్‌ అధ్యయనాలకు వీరేంద్ర మద్దతు అందించారు. ఇటీవల భారత్‌ పర్యటనకు వచ్చిన సందర్భంగా హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో తన శాసీ్త్రయ ప్రయాణంతో పాటు ట్రాన్స్‌లేషనల్‌ మెడిసిన్‌పై తన దృక్పథాన్ని అధ్యాపకులు, యువ పరిశోధకులతో పంచుకున్నారు. తన శాసీ్త్రయ ప్రయాణంలో సహకరించిన సంస్థలు, గురువులు, సహచరులు, స్నేహితులు, కుటుంబసభ్యులకు వీరేంద్ర కృతజ్ఞతలు తెలిపారు. నూతన బాధ్యతలు స్వీకరించడం పట్ల ఉత్సాహంగా ఉన్నానని, భవిష్యత్‌లో రోగులకు మెరుగైన చికిత్స అందించే ఔషధాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement