భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన

Sep 4 2026 7:23 AM | Updated on Sep 4 2026 7:23 AM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన మహోత్సవం నిర్వహించారు. వందలాది సంఖ్యలో మహిళలు సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు. శ్రవణ్‌కుమార్‌ శర్మ, గొండ్యాల రాఘవేంద్రశర్మ కుంకుమార్చన జరిపించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కుంకుమార్చనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, డిప్యూటీ మేయర్‌ సురేందర్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్‌రెడ్డి, కార్పొరేటర్లు శ్రీనివాస్‌ రమాదేవి, శివరాజ్‌ జ్యోతి, అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాజ్‌ దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement